ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వనం..జనం

ABN, Publish Date - Nov 16 , 2024 | 01:03 AM

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నుంచి, ఇబ్రహీంపట్నం మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌ వైపు నుంచి 8 కిలో మీటర్ల దూరంలో కొండపల్లి రిజర్వు ఫారె స్టులోని దొంగమర్ల బావి పర్యాట కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇది మూలపాడు, కొండపల్లి, జుజ్జూరు, దుర్గిరాలపాడు ఫారెస్టు బీట్స్‌కు మధ్యలో ఉంటుంది. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో పర్యాటకులు దొంగమర్ల బావి వద్దకు వెళుతుంటారు.

దొంగమర్లబావి వద్ద వనభోజనాలు చేస్తున్న భక్తులు

కొండపల్లి రిజర్వు ఫారెస్టులో వీరాంజనేయుడి చెంత వనభోజనాలు..కార్తీక పూజలు

ఇబ్రహీంపట్నం/ఇబ్రహీంపట్నం రూరల్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కార్తిక పౌర్ణమి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు - త్రిలోచనాపురం అటవీ ప్రాంతంలో కొండపల్లి రిజర్వు ఫారెస్టులో (దొంగమర్ల బావి)లోని వీరాంజనేయస్వామి ఆలయం వద్ద శుక్రవారం భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. పచ్చని వనాల మధ్య అడ విలో ఉన్న ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి, కార్తీ క దీపాలు వెలిగించారు. ఊటలు ఊరుతున్న వాగుల్లో పుణ్య స్నానాలు ఆచరించారు. సహపంక్తి భోజనాలు చేశారు. వం దల సంఖ్యలో భక్తులు దొంగమర్ల బావి సందర్శనకు వెళ్లారు.

పర్యాటక కేంద్రంగా దొంగమర్ల బావి

హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి నుంచి, ఇబ్రహీంపట్నం మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌ వైపు నుంచి 8 కిలో మీటర్ల దూరంలో కొండపల్లి రిజర్వు ఫారె స్టులోని దొంగమర్ల బావి పర్యాట కేంద్రంగా విరాజిల్లుతోంది. ఇది మూలపాడు, కొండపల్లి, జుజ్జూరు, దుర్గిరాలపాడు ఫారెస్టు బీట్స్‌కు మధ్యలో ఉంటుంది. కార్తీక మాసంలో అధిక సంఖ్యలో పర్యాటకులు దొంగమర్ల బావి వద్దకు వెళుతుంటారు. ఒక దారి మూలపాడు మీదుగా ఉంటే మరో దారి జి.కొండూరు మండలం గడ్డమణుగులోయ మీదుగా ఉంది. వందల ఏళ్ల నాటి ఘాట్‌ రోడ్ల మీదుగా ఇక్కడకు చేరుకోవాల్సి ఉం టుంది. అత్యధికులు గడ్డమణుగు మీదుగానే వెళుతుం టారు. ఇటునుంచి ఊటలు ఉన్న మూడు వాగులు దాటి అందమైన వనాల మధ్య అహ్లాదంగా ఉంటుంది. గడ్డమ ణుగు లోయ నుంచి వెళ్లినా 8 కిలోమీటర్ల దూరం. కార్తీక మాసంలోనే కాక ప్రతి ఆదివారం దొంగమర్ల బావి వద్దకు పర్యాటకులు వెళుతుంటారు. అక్కడున్న వీరాంజనేయ స్వామి కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. సరైన దారి సౌకర్యం లేకపోవడంతో అతి కష్టం మీద అక్కడకు చేరుకుంటున్నారు. ఆహ్లాదకరమైన వాతావ రణం మధ్య గడపడంతో వెళ్లేందుకు పడిన ఇబ్బందులన్నీ మర్చిపోతుంటారు.

దొంగమర్ల బావి అని ఎందుకంటారంటే..

బ్రిటీష్‌ కాలంలో దోపిడీ దొంగలు చుట్టు పక్కల గ్రామాల్లో దోపిడీలకు పాల్పడి, వారు దోచుకున్న సొమ్మును అక్కడకు వెళ్లి అక్కడున్న బావిలో తాగి, వాటాలు పంచుకుని రోజంతా అక్కడగడిపే వారు. అందుకనే ఆ బావికి దొంగమర్ల బావి అని పేరు వచ్చింది. ప్రస్థుతం ఆబావి పాడుపడి ఉంది.

Updated Date - Nov 16 , 2024 | 01:03 AM