TDP: కొడాలి నానిపై వర్ల రామయ్య ఫైర్..
ABN, Publish Date - Jan 18 , 2024 | 02:05 PM
కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విధ్వంసం, అరాచకం వైసీపీ లక్ష్యమని దుయ్యబట్టారు.
కృష్ణా జిల్లా: వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నానిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విధ్వంసం, అరాచకం వైసీపీ లక్ష్యమని దుయ్యబట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ వర్ధంతి టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందన్నారు. ఎన్టీఆర్కు ఇష్టమైన ఊరిలో ‘రా కదలిరా’ సభకు ఏర్పాట్లు చేశామని, సాయంత్రం తమ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. ‘‘తమకు పోటీగా కొడాలి నాని కార్యక్రమం చేయడానికి సిగ్గు ఉందా?.. వైసీపీ వాళ్లంతా ఎన్టీఆర్ అభిమానులా?.. సిగ్గు, శరం లేకుండా ఊరేగింపు చేస్తావా?.. నీకు లేకపోతే నీ నాయకుడికి అయినా ఉండాలి కదా’’ అని వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అసలు ఎన్టీఆర్ వర్ధంతికి వైసీపీ వాళ్లకు ఏం సంబంధం?.. సీఎం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు?.. ఎందుకు అడగటం లేదు?.. అని వర్ల రామయ్య ప్రశ్నించారు. వైయస్ వర్దంతిని మేము చేస్తామా?... ఈ ఆలోచన కూడా లేదా? అని నిలదీశారు. పోలీసులు కూడా వైసీపీ వారికి ఏవిధంగా అనుమతి ఇచ్చారు?.. టీడీపీ కార్యక్రమానికి... వైసీపీ వాళ్లకు ఎలా అనుమతి ఇస్తారన్నారు. ఇంకా 84 రోజులే మాత్రమే మిగిలి ఉందనేది అధికారులు గుర్తించాలని.. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలని.. వైసీపీ నాయకులకు చుట్టాలుగా కాదని వర్ల రామయ్య అన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 02:05 PM