ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

త్వరలో రాక్షస పాలన అంతం

ABN, Publish Date - Apr 19 , 2024 | 12:26 AM

గుడివాడలో రాక్షస పాలన అంతం అయ్యే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు

బొమ్ములూరులో వెనిగండ్లకు గజమాలతో స్వాగతం

గుడివాడ రూరల్‌, ఏప్రిల్‌ 18 : గుడివాడలో రాక్షస పాలన అంతం అయ్యే రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము అన్నారు. గురువారం బాబు ష్యూరిటీ - భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమంలో వెనిగండ్ల రాము, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు బొమ్ములూరులో పర్యటించారు. మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళీ గజమాలతో వెనిగండ్ల రాముకు స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలు దిష్టి తీసి హారతులతో స్వాగతం పలికారు. ముందుగా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బొమ్ములూరుకు చెందిన 100 మంది బీసీలు ఈ సందర్భంగా వెనిగండ్ల సమక్షంలో టీడీపీలో చేరు. రాము మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబు గెలుపు ఖాయమని, చంద్రబాబు సీఎం అయితే సంక్షేమ పథకాలతోపాటు సంపద సృష్టిస్తారని తెలిపారు. మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుడివాడ నియోజకవర్గ ప్రజలు రాముకు, జనసేన ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరికి ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, గుడివాడ అభివృద్ధి చెందాలంటే రామును గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు. బూతుల నానికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన కోరారు. మాజీ ఎంపీపీ గుత్తా శివరామకృష్ణ (చంటి ) ఇంటి వద్ద బొమ్ములూరుకు చెందిన కొంతమంది టీడీపీలోకి చేరి కండువాలు కప్పుకున్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, జనసేన ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీకాంత్‌, మండల పార్టీ అధ్యక్షుడు వాసే మురళీ, మాజీ ఎంపీపీ గుత్తా శివరామకృష్ణ, గుడివాడ అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ పిన్నమనేని బాబ్జీ, గుడివాడ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, బొమ్ములూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు శొంఠి నాగేశ్వరరావు, శొంఠి గంగాధరరావు, లింగం బాబ్జీ, గుత్తా శ్రీనివాసరావు, లింగం ప్రసాద్‌, కర్రే వెంకటగిరి, అంగడాల సతీష్‌, నాయకులు, పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:26 AM

Advertising
Advertising