AP Politics: రెడ్ బుక్‌లో ఏముంది.. రాష్ట్రమంతా ఇదే చర్చ..
ABN, Publish Date - Jun 06 , 2024 | 01:02 PM
రెడ్‌బుక్.. ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే చర్చ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి.. ఎన్నికల ప్రచారంలోనూ విస్తతంగా వినిపించిన మాట రెడ్‌బుక్.. ఆ సమయంలో దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.
రెడ్‌బుక్.. ఇప్పుడు రాష్ట్రమంతా ఇదే చర్చ.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర మొదలైనప్పటి నుంచి.. ఎన్నికల ప్రచారంలోనూ విస్తతంగా వినిపించిన మాట రెడ్‌బుక్.. ఆ సమయంలో దీని గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. వైసీపీ నాయకులు రెడ్‌బుక్‌పై హేళన చేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నాయకులతో పాటు.. వైసీపీ అధినేత జగన్.. ఆ పార్టీ నాయకుల మాటలు విని నిబంధనలకు విరుద్దంగా పనిచేసిన అధికారులంతా రెడ్‌బుక్ గురించే ఆలోచిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తమ పేరు రెడ్‌బుక్‌లో ఉందా లేదా అనే చర్చ జరుగుతుందట. కొంతమంది నాయకులు, అధికారులు అయితే తమకు పరిచయం ఉన్న టీడీపీ కీలకనేతలను సంప్రదించి రెడ్‌బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయని అడుగుతున్నారట. దీంతో అసలు రెడ్‌బుక్‌లో ఏముంది.. నిజంగా రెడ్‌బుక్‌లో ఎవరి పేర్లయినా ఉన్నాయా.. లేదంటే కార్యకర్తల్లో ఉత్సాహం కోసం కేవలం లోకేష్ రెడ్‌బుక్ ప్రచారం చేశారా అనే చర్చ జరుగుతోంది.
అత్యధిక మెజార్టీతో చరిత్ర సృష్టించాం
రెడ్‌బుక్ సంగతేంటి..
యువగళం సభల్లో అయితే ప్రతి సభలోనూ లోకేష్ చేతిలో ఎరుపు రంగు అట్ట ఉన్న ఒక పుస్తకం ఉండేది. దీనినే రెడ్ బుక్ అంటూ ప్రచారం చేశారు. ఎవరైతే వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడ్డారో.. దౌర్జన్యాలకు దిగారో వారిపేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నానని.. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ చట్టప్రకారం శిక్షలు తప్పవని లోకేష్ హెచ్చరించారు. అదే సమయంలో వైసీపీ అరాచకాలకు మద్దతుగా వ్యవహరించి అధికారులు, నిబంధనలు పాటించకుండా వైసీపీ నాయకుల ఆదేశాలతో టీడీపీ శ్రేణులను ఇబ్బందులు పెట్టిన వాళ్ల పేర్లు రెడ్‌బుక్‌లో రాస్తున్నాననంటూ అప్పట్లోనే లోకేష్ హెచ్చరించారు. అయితే లోకేష్ మాటలను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి రాదనే ధీమాతో వైసీపీ నాయకులు తమకు ఇష్టం వచ్చినట్లు లోకేష్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. కానీ సీన్ మారింది. వైసీపీ నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం రెడ్‌బుక్‌లో ఏముందనే చర్చ సాగుతోంది.
ఎవరెవరు ఉన్నారు..
రెడ్‌బుక్‌లో ఎవరెవరి పేర్లు ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. ముఖ్యంగా కొందరు అధికారులు వైసీపీ నాయకులు ఆదేశాలతో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. తమకు సంబంధంలేని విషయాల్లోనూ టీడీపీ నాయకులను ఇరికించే ప్రయత్నం చేశారు. వైసీపీ నాయకులు ఎన్నో అరాచకాలకు పాల్పడినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో నిబంధనలు పాటించని అధికారుల పేర్లు ఉండే అవకాశం ఉందనే చర్చ జరగుతోంది.
రెడ్‌బుక్‌లో రాజకీయ నాయకులు..
అధికారులతో పాటు కొందరు రాజకీయనాయకుల పేర్లు ఈ రెడ్‌బుక్‌లో ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడంతో పాటు.. రాజకీయంగా కక్ష తీర్చుకునేందుకు ప్రయత్నించిన కృష్ణా జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నాయకులు పేర్లు రెడ్‌బుక్‌లో ఉన్నాయనే చర్చ నడుస్తోంది. పేదల భూములు కబ్జా చేసి.. సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేసిన వైసీపీ నాయకుల పేర్లు ఈ బుక్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.
Janasena : ప్రతి ఓటూ బాధ్యత గుర్తుచేసేదే
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read Andhra Pradesh News and Latest Telugu News
Updated Date - Jun 06 , 2024 | 01:23 PM