ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వైసీపీ చీప్‌ పాలిట్రిక్స్‌

ABN, Publish Date - Apr 30 , 2024 | 12:34 AM

నామినేషన్ల ముసుగులో జనసేన పార్టీకి చెందిన గాజుగ్లాసు గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టేందుకు అధికార వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లాలో మరో కుట్రకు తెరలేపింది.

గాజుగ్లాసు గుర్తుతో మైండ్‌గేమ్‌..

ఎన్టీఆర్‌ జిల్లాలో స్వతంత్ర, అన్‌రిజిస్టర్డ్‌ పార్టీ అభ్యర్థులతో నామినేషన్లు

ఉపసంహరణ రోజున గాజుగ్లాసు గుర్తులు కోరుకునేలా డైరెక్షన్‌

విజయవాడ పార్లమెంట్‌, విజయవాడ సెంట్రల్‌, మైలవరం నియోజకవర్గాల్లో గాజుగ్లాసు కేటాయింపు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): నామినేషన్ల ముసుగులో జనసేన పార్టీకి చెందిన గాజుగ్లాసు గుర్తుతో అభ్యర్థులను నిలబెట్టేందుకు అధికార వైసీపీ ఎన్టీఆర్‌ జిల్లాలో మరో కుట్రకు తెరలేపింది. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ప్రయోజన కరంగా మార్చుకునేందుకు టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే చోట ఓటర్లను గందరగోళపరిచేందుకు స్వతంత్ర అభ్యర్థులు, అన్‌ రిజిస్టర్డ్‌ పార్టీల తరఫున పలువురితో నామినేషన్లు వేయించి గాజుగ్లాసు గుర్తును వారితో డిమాండ్‌ చేయించింది. దీంతో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా బరిలో నిలిచిన పలువురికి గాజుగ్లాసు గుర్తులు వచ్చాయి. గుర్తింపు పొందిన పార్టీలకు వారి గుర్తులు యథావిధంగా ఉంటాయి. గుర్తింపు లేని పార్టీలకు పోటీ చేసే చోట గుర్తులు అలాగే ఉన్నా, పోటీచేయని నియోజకవర్గాల్లో ఆ పార్టీ గుర్తులను ఎవరైనా కోరితే వారికి కేటాయించవచ్చు.

టీడీపీ, బీజేపీలతో జనసేన పొత్తులో ఉండటం వల్ల ఎన్టీఆర్‌ జిల్లాలో ఎక్కడా జనసేన అభ్యర్థులు పోటీ చేయలేదు. దీంతో గాజుగ్లాసును కోరిన వారికి ఇవ్వాల్సి వచ్చింది. ఎన్టీఆర్‌ జిల్లాలో విజయవాడ పార్లమెంట్‌, విజయవాడ సెంట్రల్‌, మైలవరం నియోజక వర్గాలలో స్వతంత్రులు, అన్‌ రిజిస్టర్డ్‌ పార్టీల అభ్యర్థులకు గాజుగ్లాసు గుర్తులను కేటాయించారు. నందిగామ నియోజకవర్గంలో ఎవరికీ గాజుగ్లాసును కేటాయించలేదు. తిరువూరు, జగ్గయ్యపేట, విజయవాడ వెస్ట్‌లో గాజు గ్లాసును కేటాయించే అవకాశముంది. ఇంకా వివరాలు రాలేదు. విజయ వాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో కృష్ణ కిషోర్‌ యనమండ్ర (నవతరం పార్టీ)కి, సెంట్రల్‌ నియోజకవర్గంలో గొల్లపల్లి ఫణిరాజ్‌(ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి)కి, మైలవరం నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థి వల్లభనేని నాగపవన్‌కుమార్‌కు గాజుగ్లాసును కేటాయించారు.


విజయవాడ పార్లమెంట్‌ బరిలో 17 మంది

విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గంలో 19 మందికి గాను స్వతంత్ర అభ్యర్థులు అర్జున్‌ చెవిటి, చరణ్‌ సుజిత్‌ నంబూరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అంతిమంగా 17 మంది బరిలో నిలిచారు. వారికి వరుస క్రమంలో జిల్లా ఎన్నికల అధికారి దిల్లీరావు ఎన్నికల గుర్తులను కేటాయిం చారు. కేశినేని శివనాథ్‌(టీడీపీ)కి సైకిల్‌, కేశినేని శ్రీనివాస్‌ (వైసీపీ) సీలింగ్‌ ఫ్యాన్‌, భార్గవ్‌ వల్లూరు(కాంగ్రెస్‌)కు హస్తం, మేకా వెంకటేశ్వరరావు (బీఎస్పీ)కు ఏనుగు గుర్తులను కేటా యించారు. అన్‌ రిజిస్టర్డ్‌ పార్టీలకు కృష్ణ కిషోర్‌ యనమండ్ర (నవతరం పార్టీ)కి గాజుగ్లాసు, గుజ్జుల లలిత(ఎస్‌యూసీఐ- కమ్యూనిస్ట్‌)కు బ్యాట్‌, చాగంటిపాటి గంగాధర్‌ గాంధీ (పిరమిడ్‌ పార్టీ)కి టెలివిజన్‌, చింతలచెరువు హేమలత(జై మహాభారత్‌)కు ఫ్లూటు, ఎన్‌.దశరథరామిరెడ్డి(జైహింద్‌ పార్టీ)కు గ్యాస్‌ సిలిండర్‌, దాట్ల లూర్దు మేరీ(జై భీమ్‌రావు భారత్‌ పార్టీ)కు కోటు, దేవరశెట్టి రవీంద్రబాబు(ఏఆర్‌పీఎస్‌)కు మిక్సీ, పేరం శివనాగేశ్వరరావు(రిపబ్లికన్‌ పార్టీ)కి పండ్లబుట్ట, బర్రె శ్రీనివాసరావు(తెలుగు రాజాధికార పార్టీ)కు రబ్బరు స్టాంప్‌, సయ్యద్‌ ఖమరున్నీసా (నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ) బక్కెట్‌, అనిల్‌కుమార్‌ మద్దినేని(స్వతంత్ర)కు చెప్పులు, దేవరపల్లి మల్లికార్జునరావు(స్వతంత్ర)కు వజ్రం, పప్పూరి వెంకట అశోక్‌(స్వతంత్ర)కు ఏసీగుర్తులను కేటాయించారు.


అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా..

నందిగామ నియోజకవర్గంలో 11 మందికి ఇద్దరు నామి నేషన్లను ఉపసంహరించుకున్నారు. 9 మంది బరిలో ఉన్నారు. తంగిరాల సౌమ్య (టీడీపీ)కి సైకిల్‌, బర్రె ఉదయకిరణ్‌(బీఎస్పీ)కి ఏనుగు, మొండితోక జగన్మోహ నరావు(వైసీపీ)కి సీలింగ్‌ ఫ్యాన్‌, వజ్రయ్య మందా (కాంగ్రెస్‌)కు హస్తం, మిగిలిన అభ్యర్థులకు సైకిల్‌ పంపు, ఫ్లూటు, కోటు, రైతు, ఆపిల్‌ గుర్తులను కేటాయించారు.

విజయవాడ సెంట్రల్‌లో 22 మందికి ఇద్దరు ఉపసంహరించుకున్నారు. ఐ.రాజేంద్ర ప్రసాద్‌(బీఎస్పీ)కి ఏనుగు, చిగురుపాటి బాబూరావు(సీపీఎం)కు సుత్తి- కొడవలి-నక్షత్రం, బొండా ఉమామహేశ్వరరావు(టీడీపీ)కు సైకిల్‌, వెలంపల్లి శ్రీనివాసరావు(వైసీపీ)కు సీలింగ్‌ ఫ్యాన్‌, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి తరఫున పోటీ చేస్తున్న గొల్లపల్లి ఫణిరాజ్‌కు గాజుగ్లాసు గుర్తును కేటాయించారు.

విజయవాడ పశ్చిమలో 17మందికి ఇద్దరు ఉపసంహరిం చుకున్నారు. 15 మంది రంగంలో ఉన్నారు.

విజయవాడ తూర్పులో 17మందికి ఇద్దరు ఉపసంహరించుకున్నారు. 15 మంది బరిలో ఉన్నారు.

మైలవరంలో 12 కు 12 మంది బరిలో ఉన్నారు.

తిరువూరులో 13 మందికి ఒక్కరు ఉపసంహరించుకున్నారు. 12 మంది బరిలో నిలిచారు.

జగ్గయ్యపేటలో 14 మందికి ఒక్కరు ఉపసంహరించుకున్నారు. 13 మంది బరిలో నిలిచారు.

Updated Date - Apr 30 , 2024 | 08:10 AM

Advertising
Advertising