ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రేషన షాపుల్లో 14 రకాల సరుకులు ఇవ్వాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 12:42 AM

చౌక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పేదలకు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. జగన్నాథం డిమాండ్‌ చేశారు.

తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న సీపీఐ నాయకులు

కర్నూలు(రూరల్‌), సెప్టెంబరు 4: చౌక దుకాణాల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులను పేదలకు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కె. జగన్నాథం డిమాండ్‌ చేశారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు మూడో రోజు కర్నూలు రూరల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బుధవా రం ఆ పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమానికి నగర సహాయ కార్యదర్శి మహేష్‌ అధ్యక్షత వహించగా ముఖ్య అతిఽథిగా జగన్నాథం హాజరై ప్రసంగించారు. నిత్యావసర సరుకుల ధరలను నియం త్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శిం చారు. కర్నూలు నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వానికి పేదలపై ఏ మాత్రం గౌరవం ఉన్నా.. 14రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దార్‌ రమేష్‌బాబుకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌, శ్రీనివాసరావు, నాగరాజు, భీసన్న, గిడ్డమ్మ, నీలకంఠప్ప తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 12:42 AM

Advertising
Advertising