ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటరు నమోదుకు 284 దరఖాస్తులు: కమిషనర్‌

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:51 AM

నియోజకవర్గం లోని 258 పోలింగ్‌ కేంద్రాల వద్ద శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదుకు 284 దరఖాస్తులు వచ్చినట్లు నగర పాలక కమిషనర్‌, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధఙకారి ఎస్‌.రవీంద్ర బాబు అన్నారు.

ఓటరు నమోదును పరిశీలిస్తున్న కమిషనర్‌ రవీంద్రబాబు

కర్నూలు న్యూసిటీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): నియోజకవర్గం లోని 258 పోలింగ్‌ కేంద్రాల వద్ద శని, ఆదివారాల్లో నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదుకు 284 దరఖాస్తులు వచ్చినట్లు నగర పాలక కమిషనర్‌, కర్నూలు నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్‌ అధఙకారి ఎస్‌.రవీంద్ర బాబు అన్నారు. ఆదివారం కేవీఆర్‌ జూనియర్‌ కళావాల, మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌, మున్సిపల్‌ ఉర్దూ ప్రైమరీ స్కూల్‌, రోజా స్ర్టీట్‌, ప్రకాష్‌నగర్‌ మున్సిపల్‌ హై స్కూల్‌, నరసింహారెడ్డినగర్‌, కప్పల్‌నగర్‌, లేబర్‌ కాలనీ, వెంకటరమణ కాలనీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలను కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 258 పోలింగ్‌ కేంద్రాల వద్ద ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలు ఏర్పాటు చేయగా.. కొత్త ఓటు నమోదుకు సంబంధించి ఫారం-6కు 73, మృతిచెందిన మరో పోలింగ్‌ కేంద్రానికి ఓటు మార్పు వంటి కారణాలతో ఓటు తొలగింపునకు సంబంధించి ఫారం-7కు 62, పేరు, చిరునామా తదదితర వివరాల మార్పునకు సంబంధించి ఫారం-8 149 దరఖాస్తులు వచ్చాయన్నారు. కొత్త ఓటు నమోదు, వివరాల మార్పు, తొలగింపునకు వంటి సేవలకు ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఉందని, ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ లేదా స్థానిక బీఎల్వోల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో తహసీ ల్దార్‌ వెంకటలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్‌ ధనుంజయ, సూపరింటెండెంట్‌ సుబ్బన్న పాల్గొన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:51 AM