ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 86 ఫిర్యాదులు

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:06 AM

స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి. బిం దు మాధవ్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయి.

ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎస్పీ జి.బిందు మాధవ్‌

విచారణ జరిపి న్యాయం చేస్తాం

ఎస్పీ జి. బిందు మాధవ్‌

కర్నూలు క్రైం, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): స్థానిక కొత్తపేటలోని టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఎస్పీ జి. బిం దు మాధవ్‌ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్య క్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మొత్తం 86 ఫిర్యాదులు వచ్చాయి.

గూడూరుకు చెందిన సుభాకర్‌ ఎమ్మిగనూరులో యోగా టీచర్‌ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ.6లక్షలు తీసుకుని మో సం చేశాడని కర్నూలుకు చెందిన శ్వేతారెడ్డి ఫిర్యాదు చేశారు.

పొట్లపాడు గ్రామానికి చెందిన నాగరాజు ఏపీ మోడల్‌ స్కూల్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.5 లక్ష లు తీసుకుని మోసం చేశాడని దేవనకొండ మండలం, వెంకటాపురం గ్రామానికి చెందిన అన్వేష్‌ ఫిర్యాదు చేశారు.

పొలం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తామని చెప్పి మహేష్‌ రూ.2,65 లక్షలు తీసుకుని మోసం చేశాడని దేవనకొండ మండలం పల్లెదొడ్డి గ్రామానికి చెందిన భీమలింగడు ఫిర్యాదు చేశారు.

తన బిడ్డ పద్మావతిని అల్లుడు శేఖర్‌ తీవ్రంగా గాయపరిచాడని, న్యాయం చేయాల ని వెల్దుర్తి మండలం బాగోలి గ్రామానికి చెం దిన సోమేష్‌ ఫిర్యాదు చేశారు.

ప్లాట్‌ కొనడానికి రూ.50 లక్షలు కట్టామని, అయితే ప్లాట్‌ రిజిస్ర్టేషన్‌ కాదని చెప్పాదని, తిరిగి డబ్బు ఇవ్వ కుండా కర్నూలుకు చెందిన వసంతకుమారి బెదిరిస్తున్న దని కర్నూలు గురు రాఘవేంద్రనగర్‌కు చెందిన రామ్మోహన్‌ ఫిర్యాదు చేశారు.

తన ప్రమేయం, సంతకం లేకుండానే తన బావ ప్రసాద్‌, క్రెడిట్‌ కార్డు లోన్‌ రూ.5 లక్షలు, బిజినెస్‌ లోన్‌ రూ.1లక్ష తీసుకుని తిరిగి కట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వెల్దుర్తికి చెందిన రాజేష్‌ ఫిర్యాదు చేశారు.

ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి జాయ్‌ హోమ్స్‌కు చెందిన చంద్రకంటి రామకృష్ణ అలియాస్‌ కిషన్‌ డబ్బులు తీసుకుని ఇబ్బందిపెడుతున్నాడని కర్నూలు గణేష్‌ నగర్‌కు చెందిన మల్లికార్జున ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదులన్నింటినీ పరిష్కరిస్తానని ఎస్పీ జి. బిందుమాధవ్‌ హామీ ఇచ్చారు.

Updated Date - Nov 12 , 2024 | 12:06 AM