ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి

ABN, Publish Date - Oct 16 , 2024 | 12:48 AM

ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో మంగళవారం అబ్దుల్‌ కలాం జయంతిని నిర్వహించారు.

మాట్లాడుతున్న డీఎస్పీ రామాంజి నాయక్

మహానంది, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో మంగళవారం అబ్దుల్‌ కలాం జయంతిని నిర్వహించారు. ఉపాధ్యాయిలు, స్కౌట్‌ విద్యా ర్థులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ పీర్‌బాషా, ఉపాధ్యాయిడు వెంకటేశ్వర్లు, ప్రతాపరెడ్డి, కృష్ణమూర్తి, అసిఫాభాను, మౌనిక, శైలజ పాల్గొన్నారు.

ఆత్మకూరు: భారతజాతి గర్వించదగ్గ గొప్ప మేధావి, క్షిపణి పితామహుడు, భావితరాలకు మార్గదర్శి, భారతరత్న ఏపీజే అబ్దుల్‌కలాం స్పూర్తి దేశానికే ఆదర్శమని ఆత్మకూరు డీఎస్పీ రామాంజీనాయక్‌ పేర్కొన్నారు. మంగళవారం భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలాం 93వ జయంతి వేడుకలను స్థానిక జగద్గురు మఠంలో డాక్టర్‌ అబ్దుల్‌ కలాం స్మారక సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలందించిన వెంకటసుబ్బయ్యఆచారీ, రామ్‌ప్రసాద్‌, యుగంధర్‌, సలాం, రుక్మిణీదేవీ, అల్తాఫ్‌హుసున్‌లను ఘనంగా సత్కరించారు. అలాగే చెంచు మహిళలకు, మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు చీరలను పంపిణీ చేశారు. ఎంఈవో సురేష్‌, డాక్టర్‌ అబ్దుల్‌ కలాం స్మారక సమితి ప్రతినిధులు జవహర్‌నాయక్‌, శీలం శేషు, వాసుదేవరెడ్డి, నరసింహానాయక్‌ తదితరులు ఉన్నారు.

ఆత్మకూరులోని నంద్యాల టర్నింగ్‌లో గల కృషి పండ్ల తోటల రైతు సేవా కేంద్రంలో మంగళవారం మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు. సంఘం నాయకులు మహెబూబ్‌బాషా, మోమిన్‌ మునీర్‌బాషా పాల్గొన్నారు.

నంద్యాల రూరల్‌: పట్టణంలోని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కార్యాలయంలో మంగళవారం అబ్దుల్‌కలాం జయంతిని నిర్వహించారు. రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు రహీం, సాంస్కృతిక విభాగం జిల్లా కన్వీనర్‌ శివరామిరెడ్డి, కోశాధికారి రహంతుల్లా, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2024 | 12:48 AM