ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాధ్యతగా పని చేయండి

ABN, Publish Date - Nov 30 , 2024 | 12:17 AM

ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని డీపీవో భాస్కర్‌ హెచ్చరించారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న డీపీవో భాస్కర్‌

డీపీవో భాస్కర్‌

కోసిగిలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ అధికారులపై ఆగ్రహం

కోసిగి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ బాధ్యతగా పని చేయాలని డీపీవో భాస్కర్‌ హెచ్చరించారు. కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ హాస్టల్‌ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా యని, సరైన వసతులు లేవని ఫిర్యాదు చేశాడు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శుక్రవారం సాయంత్రం డీపీవో కోసిగిలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ ను పరిశీలించారు. పరిసరాలు చెత్తాచెదారం, పందులతో నిండి ఉండ టంతో అధికారులపై డీపీవో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే హాస్టల్‌లో బాతరూమ్‌లో నీరు లేక దుర్వాసన వెదజల్లుతుండటంతో వార్డెన కోటేశ్వరయ్యపై మండిపడ్డాడు. పంచాయతీ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌కు గేటు ఏర్పాటు చేయాలని, చెత్తాచెదారం హాస్టల్‌ ఆవరణం ముందు వేయకుండా చూడాలన్నారు. అనంతరం హాస్టల్‌లో అందించే మోనూ భోజనం విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. డీపీవో వెంట జాయింట్‌ డైరెక్టర్‌ రంగలక్ష్మిదేవి, తహసీల్దార్‌ నిత్యానందరాజు, ఎస్‌ఐ చంద్రమోహన, ఈవో తిరుమలేశ్వరరెడ్డి, ఏపీవో చంద్రశేఖర్‌ ఉన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:17 AM