మరమ్మతులకు చర్యలు
ABN, Publish Date - Sep 05 , 2024 | 12:31 AM
వర్షంతో దెబ్బతిన్న ప్రధాన రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు.
ఎమ్మిగనూరు, సెప్టెంబరు 4: వర్షంతో దెబ్బతిన్న ప్రధాన రహదారుల మరమ్మతులకు చర్యలు తీసుకుంటు న్నట్లు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి తెలిపారు. బుధవారం ప్రధాన రహదారులైన శివ సర్కిల్, బస్టాండ్ రోడ్డు, బైపాసురోడ్డు, గోనెగండ్ల సర్కిల్ ప్రాంతాలను ఆర్‌అండ్‌బీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వర్షానికి రహదారులు గుంతలు పడి పాడైపోయాయన్నారు. మరమ్మతులను రెండు, మూడు రోజుల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామనని తెలిపారు. గత ప్రభుత్వం రహదారుల మరమ్మతులకు, కొత్త రహదారుల నిర్మాణానికి చర్యలు తీసుకోకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఎల్లెల్సీ కాలువను పరిశీలించి, నిమజ్జనానికి ఏర్పాట్లు చేయలని అధికారులకు సూచించారు. ఆర్‌అండ్‌బీ డీఈ నాగరాజు, సూపర్‌వైజర్ ప్రభు, కౌన్సిలర్ రాందాసుగౌడు, అమాన్, టీడీపీ నాయకులు తురేగల్ నజీర్, దేవదాసు, వడ్డె కృష్ణ, సోమన్న, సోములగూడూరు బాషా, కామార్తి మహేష్ పాల్గొన్నారు.
Updated Date - Sep 05 , 2024 | 12:31 AM