ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ గ్రామల్లో అదనపు బందోబస్తు ఏర్పాటు చేయాలి

ABN, Publish Date - May 30 , 2024 | 11:55 PM

సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డిమాండ్‌ చేశారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి

కర్నూలు(అర్బన్‌), మే 30: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్‌ సమయంలో సమస్యాత్మక గ్రామాల్లో అదనపు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ జి.సృజనను ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తిక్కారెడ్డి మాట్లాడుతూ ఈనెల 13న జరిగిన పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించినందుకు జిల్లా కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. జిల్లాలోని కొన్ని సమస్యాత్మక గ్రామల్లో అల్లర్లు, గొడవలు జరిగే అవకాశం ఉందన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగిన బందోబస్తు ఏర్పాటు చేయించాలని కోరారు. కర్నూలు పార్లమెంట్‌ పరిధిలోని పత్తికొండ నియోజకవర్గంలో 17 గ్రామాలు, కోడుమూరు నియోజవర్గంలోని 26 గ్రామాలు, ఎమ్మిగనూరు నియోజక వర్గంలోని 16 గ్రామాలు, మంత్రాలయం నియోజకవర్గంలోని 5 ప్రాంతాలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. ఆయా గ్రామాల్లో అదనపు బలగాలను మోహరించాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నంద్యాల నాగేంద్ర, లీగల్‌ సెల్‌ ప్రధాన కార్యదర్శి ఎల్‌వీ ప్రసాద్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - May 30 , 2024 | 11:55 PM

Advertising
Advertising