ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమాజంలో అందరూ సమానులే

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:07 AM

సమాజంలో అందరూ సమానమేనని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని జూటూరులో తహసీల్దార్‌ రమేష్‌ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు.

పత్తికొండలో మాట్లాడుతున్న డీఎస్పీ వెంకట్రామయ్య

సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య

పత్తికొండ టౌన్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘సమాజంలో అందరూ సమానమేనని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య పేర్కొన్నారు. శనివారం మండలంలోని జూటూరులో తహసీల్దార్‌ రమేష్‌ అధ్యక్షతన పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు. అణణగారిన వర్గాల అభ్యున్నతికి రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు, హక్కులు కల్పించారన్నారు. పౌరహక్కులకు ఎవరూ భంగం కలిగించవద్దన్నారు. దళితులపై వివక్ష చూపవద్దని, సమస్యలు తలెత్తితే అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సైబర్‌ నేరాలపట్ల జాగ్రత్త వహించాల న్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాగా చది వించాలన్నారు. సైబర్‌ నేరాలపై పోలీసు శాఖ ప్రచురించిన కరపత్రాలను విడుదల చేశారు. పత్తికొండ సీఐ జయన్న, ఆర్‌ఐ శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్‌ ఈశ్వరప్ప, ఎంపీటీసీ మెంబర్‌ రంగమ్మ, వీఆర్వో వాసు, భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

క్షణికావేశంలో తప్పులు చేయొద్దు

తుగ్గలి: క్షణికావేశంలో తప్పులు చేయొద్దని, సమస్యలుంటే పెద్దలతో చర్చించి పరిష్కరించుకోవాలని పత్తికొండ డీఎస్పీ వెంకట్రామయ్య సూచించారు. శనివారం మండలం లోని శభాష్‌పురంలో కార్డెన్‌సెర్చ్‌ చేశారు. చర్చలతో సమస్య పరిష్కారం కాకపోతే పోలీసుల దృష్టికి తేలన్నారు. యువత మత్తుపదార్థాలు, మద్యానికి బానిసలు కావొద్దని, జూదం జోలికి పోవద్దన్నారు. సీఐలు పులిశేఖర్‌, జయన్న, మస్తాన్‌వలి, ఎస్‌ఐలు జయశేఖర్‌గౌడు, కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:07 AM