ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సమస్యలన్నీ పరిష్కరిస్తా

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:03 AM

ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పేర్కొన్నారు.

గుళ్లదుర్తిలో ‘ఇది మంచి ప్రభుత్వ’ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రి బీసీ జనార్దన రెడ్డి

గుళ్లదుర్తి గ్రామంలో పర్యటించిన మంత్రి బీసీ

కోవెలకుంట్ల, సెప్టెంబరు 20: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన రెడ్డి పేర్కొన్నారు. మండలపరిధిలోని గుళ్లదుర్తి గ్రామంలో కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఇది మంచి ప్రభుత్వం’ ప్రజా వేదిక సమస్యల పరిష్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి బీసీతో పాటు కలెక్టర్‌ రాజకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గ్రా మంలో బీసీ బాలుర హాస్టల్‌లో విద్యార్థులకు మరుగుదొడ్లు సరిగా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆస మస్య పరిష్కరించాలని గ్రామస్థులు మంత్రి దృష్టికి తేవడంతో మంత్రి తన సొంత నిధులు రూ.2లక్షలు అందించి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ పనుల నిమిత్తం విద్యుతలో ఏవైనా అంతరాయాలు ఏర్పడినా విద్యుత సమస్య పరిష్కరించాలని సబ్‌స్టేషన వద్దకు వెళ్తే అధికారులు పట్టించుకోవడం లేదంటూ ప్రజలు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే మంత్రి సంబంధిత ఏడీ, ఏఈని పిలిపించి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామానికి చెందిన అమ్మభగవాన పొదుపు గ్రూపు మహిళలు గ్రామంలో నిర్వహిస్తున్న ఇది మంచి ప్రభుత్వం.. కార్యక్రమంలో మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పొదుపు మహిళలు బ్యాంకు నుంచి రూ.15లక్షలు రుణం తీసుకున్నారని, అయితే కంతులు 24 కట్టాల్సి ఉండగా 12 కంతులు చెల్లించగానే తమకు తెలియకుండా బ్యాంకు అధికారులు రెన్యువల్‌ చేసి అదనంగా రూ.40వేలు వడ్డీ కట్టాలని అంటున్నారని ఇదేమని ప్రశ్నిస్తే పై అధికారులు జారీ చేశారని అందువల్లనే వేశామని అంటున్నారని ఈ సమస్య పరిష్కరించాలని మంత్రి దృష్టికి తెచ్చారు. సంబంధిత ఏపీయంను పిలిపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ ఉమాకాంతరెడ్డి, పీఆర్‌డీఈ నాగశ్రీనివాసులు, ఎంపీడీవో సయ్యదున్నీసా, తహసీల్దారు పవనకుమార్‌రెడ్డి, టీడీపీ నాయకులు పరమేశ్వర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, గోవర్ధనరెడ్డి, రవిరెడ్డి, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 21 , 2024 | 01:03 AM