బాధితులంతా కలెక్టరేట్‌కే
ABN, Publish Date - Nov 11 , 2024 | 12:37 AM
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో అనేక అంచెల వ్యవస్థలు ఉన్నాయి.
నమ్మకం కల్పించని మండల యంత్రాంగం
సమస్యను పరిష్కరించకుండానే ఫైల్ క్లోజ్
ప్రతి వారం రద్దీగా కలెక్టరేట్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు కలెక్టరేట్, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంలో అనేక అంచెల వ్యవస్థలు ఉన్నాయి. ఊళ్లలో గ్రామ, వార్డు సచివాలయాలు పని చేస్తున్నాయి. ప్రతి మండలంలోని ఎమ్మార్వో, ఎంపీడీవో తదితర ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. వీఆర్వో, పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ తదితర ప్రభుత్వ ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎమ్మార్వో కార్యాలయం నుంచి కమిషనర్ కార్యాలయం వరకు వెళ్లి బాధితులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ క్షేత్రస్థాయి అధికారులు ఆ నమ్మకం ఇవ్వడం లేదు. దీంతో సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడమే ప్రభుత్వ యంత్రాంగ కర్తవ్యం. ప్రతి సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించడానికి ప్రయత్నించాలి. దీని కోసం ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో, మున్సిపాలిటీ, కార్పొరేషన్లలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రభుత్వం నిర్వహిస్తోంది. కానీ అక్కడ అధికారులు సమస్యలు పరిష్కరించకుండానే పైల్ మూసేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో బాధితులు కర్నూలే కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వెళ్లక తప్పడం లేదు. కింది స్థాయిలో పరిష్కారంకాని సమస్యలు మాత్రమే కలెక్టరేట్‌లో జరిగే కార్యక్రమానికి వెళ్లాలి. కానీ దీనికి పూర్తి భిన్నంగా జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కర్నూలు జిల్లాలో దాదాపు 26 మండలాలు ఉన్నాయి. చిన్న మండలం పరిధిలో 10 గ్రామాలు, పెద్ద మండలం పరిధిలో 20 నుంచి 24 గ్రామాలు న్నాయి. మండల పరిధిలో తహసీ ల్దార్లు, ఎంపీడీవోలు సమ స్యల్ని పట్టించుకుని పరిష్కరిస్తారన్న నమ్మ కం బాధితులకు కల్పించడం లేదని విమర్శలు వస్తున్నాయి. అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించి ఆ ఫైల్‌ను క్లోజ్ చేయాలి. కానీ కొం దరు అధికారులు విచారణ జరప కుం డానే తప్పుడు సమాచారంతో ఫైళ్లను క్లోజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యల పరి ష్కార వేదికలో అధిక శాతం రెవెన్యూ, భూ సమ స్యల ఎక్కువగా వస్తున్నాయి. వాటి పరిష్కారంలో స్థానిక అధికారులు సరిగా వ్యవహరించడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది.
భూ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం:
ప్రతి గ్రామంలో రైతులు భూ సమస్యలుపై వీఆర్వో, ఎమ్మార్వో గ్రామ సర్వేకు ఫిర్యాదు చేస్తున్నారు. భూసర్వే సమస్యల పరిష్కారం కోసం గత నెల 8వ తేదీ నుంచి నవంబరు 15వ తేదీ వరకు రెవెన్యూ గ్రామసభల ద్వారా రైతుల నుంచి అర్జీలను స్వీకరిస్తున్నారు.
కర్నూలు డివిజన్‌లో కల్లూరు మండలంలో 1484, కోడుమూరు మండలంలో 911, ఓర్వకల్లు మండలంలో 819, వెల్దుర్తి మండలంలో 781, మండలంలో 705, కర్నూలు రూరల్ మండలంలో 601లు ఉన్నాయి.
ఆదోని డివిజన్‌లో మంత్రాలయం మండలంలో 989, పెద్దకడుబూరు మండలంలో 929, ఆదోని మండలంలో 822, గోనెగండ్ల మండలంలో 611, ఎమ్మిగనూరు మండలంలో 565, కోసిగి మండలంలో 402 ఉన్నాయి.
పత్తికొండ డివిజన్‌లో దేవనకొండ మండలంలో 895, తుగ్గలి మండలంలో 877, ఆలూరు మండలంలో 708, ఆస్పరి మండలంలో 690, హాలహర్వి మండలంలో 708, రైతుల భూసమస్యలపై వినతులు ఇచ్చారు. రీసర్వే జరిగిన గ్రామాల్లో సరాసరిగా రెవెన్యూ గ్రామసదస్సులో 100 నుంచి 500 వరకు రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. భూసమస్యల పరిష్కారం కోసం రైతులు వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. మండల స్థాయిలో భూసమస్యల పరిష్కారం కాకపోతే కలెక్టరేట్‌లో జరిగే ప్రజా ఫిర్యాదుల పరిస్కార వేదికలో అర్జీలు ఇచ్చేందుకు రైతులు సిద్ధమవుతున్నారు.
ఇన్‌చార్జిల పాలనతో అస్తవ్యస్తం
జిల్లాలోని వివిధ శాఖలలో అధికారులు లేకపోవడంతో ఇన్‌చార్జిల పాలన కొనసాగుతోంది. కొందరు అధికారులకు రెండు, మూడు శాఖల బాధ్యతల్లో ఉండటంతో పాలనపై దృష్టి సారించలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీని వల్ల ఆ శాఖలలో ఉన్న అధికారులు సమస్యల పరిష్కారంపై నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు గ్రామ, వార్డు సచివాలయాల మీద ఉన్నతాధికారుల పర్యవేక్షణ, తనిఖీ లేకపోవడంతో సచివాలయల సిబ్బంది ప్రజలు సమస్యలను పట్టించుకోవడం లేదని ప్రజా సంఘాల నాయకులు, విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు. సచివాలయాలు, మండల కార్యాలయాలను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే మంచి పరిపాలన అందించవచ్చని పలువురు వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Nov 11 , 2024 | 12:38 AM