దిగజారుడు రాజకీయాలు మానుకోండి
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:28 PM
వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు.
కర్నూలు అర్బన్, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు సూచించారు. బుఽధవారం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కన్నతల్లిపై కేసు వేసిన నీచ చరిత్ర జగన్మోహన్‌రెడ్డిదని ధ్వజమెత్తారు. దుర్మార్గుడైన జగన్‌కు మద్దతుగా వైవీ సుబ్బారెడ్డి, సాయిరెడ్డి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ ఆస్తిలో షర్మిలకు వాటా ఉందని, తండ్రి చెప్పాడని, మా కుటుంబ వ్యవహారాల్లో వైవీ. విజయసాయి జోక్యం ఎందుకని ప్రశ్నించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం ముమ్మరంగా సాగుతోందని, ప్రతి ఒక్కరు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Updated Date - Oct 30 , 2024 | 11:28 PM