ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టోల్‌ ఫ్రీ నెంబర్లపై అవగాహన ఉండాలి

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:28 AM

టోల్‌ ఫ్రీ నెంబర్లు 112, 1930పై అవగాహన కలిగి ఉండాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు.

ఆటోకు పోస్టర్‌ అంటిస్తున్న ఎస్పీ అధిరాజ్‌ సింగ్‌ రాణా

నంద్యాల క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): టోల్‌ ఫ్రీ నెంబర్లు 112, 1930పై అవగాహన కలిగి ఉండాలని నంద్యాల ఎస్పీ అధిరాజ్‌సింగ్‌ రాణా అన్నారు. సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాల యం వద్ద జిల్లా మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాములు, రమేష్‌ బాబుతో కలిసి 112, 1930 టోల్‌ ఫ్రీ నెంబర్లపై ముద్రించిన పోస్టర్లను ఆటోలకు అతికిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ మహిళలు, చిన్న పిల్లలు, ఇతరులు ఎవరైనా బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, ర్యాగింగ్‌, ఈవ్‌టీజింగ్‌, గృహ హింస, అవమానానికి గురిచేయడం, బెదిరించడం తదితర వాటివల్ల ఇబ్బంది పడినట్లయితే వెంటనే 112, 1930 టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేయాలన్నారు. అలాగే సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫాం ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఎక్స్‌ వంటి వాటిద్వారా సైబర్‌ నేరగాళ్ల చేతిలో పడి మోసపోయి ఉంటే వెంటనే టోల్‌ ఫ్రీ నెంబర్లకు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని కోరారు. ఈ నెంబర్లపై అవగాహన కోసమే ఆటోలకు అతికించా మని అన్నారు. కార్యక్రమానికి నాంది పలికిన జిల్లా మహిళా పోలీస్‌ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ జయరాములును ఎస్పీ అభినందించారు.

Updated Date - Oct 22 , 2024 | 01:28 AM