ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బై బై.. గణేశా..!

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:55 PM

నగరంలో గణేశ్‌ నిమజ్జనవేడుకలు కన్నుల పండువగా సాగాయి. తొమ్మిది రోజులుగా మండపాల్లో పూజలు అందుకున్న వినాయకుడు ఆదివారం నిమజ్జనానికి తరలివెళ్లారు. ఉత్సవాల్లో యువత, పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు.

విద్యుత్‌ కాంతులతో శోభాయమానంగా వినాయక ఘాట్‌

నిమజ్జనోత్సవంలో యువత సందడి

నగరంలో 2 వేలకు పైగా విగ్రహాలు నిమజ్జనం

కోలాహలంగా సాగిన శోభాయాత్ర

ముగిసిన గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలు

కర్నూలు (కల్చరల్‌/న్యూసిటీ), సెప్టెంబరు 15: నగరంలో గణేశ్‌ నిమజ్జనవేడుకలు కన్నుల పండువగా సాగాయి. తొమ్మిది రోజులుగా మండపాల్లో పూజలు అందుకున్న వినాయకుడు ఆదివారం నిమజ్జనానికి తరలివెళ్లారు. ఉత్సవాల్లో యువత, పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొన్నారు. ఈ ఏడాది ఐదు అడుగుల నుంచి ఇర వై అడుగుల వరకు వినాయక ప్రతిమలు ఏర్పాటు చేశారు. వివిధ వేషధారణలు ధరించి భక్తులను ఆకట్టుకున్నారు. బాణసంచా కాలుస్తూ, రంగులు చల్లుకుంటూ, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఆనందోత్సాహాలతో ఊరేగింపుగా వినాయక ఘాట్‌కు వెళ్లారు. ‘గణపతి బొప్పా మోరియా’ అనే నినాదాలు చేశారు. పాతనగరం నుంచి వినాయక ఘాట్‌ వరకు, అటు నంద్యాల చెక్‌పోస్టు, ఇటు బళ్లారి చౌరస్తా, మరోవైపు కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌ నుంచి నాలుగు చోట్ల నుంచి ఘాట్‌ వరకు రహదారులన్నీ జనంతో కిటకిటలాడాయి. నగరంలోని ప్రధాన రహదారుల్లోని దుకాణాలను నిర్వాహకులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆదివారం సెలవు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు, యువత నిమజ్జనాన్ని వీక్షించడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు.

సిరి సంపదలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి : మంత్రి భరత్‌

సిరి సంపదలతో జిల్లా ప్రజలు సుభిక్షంగా ఉండేలా చూడాలని గణనాథుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్‌ వేడుకున్నారు. ఉదయం రాంబొట్ల దేవాలయం వద ్ద వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసిన తొలి నిమజ్జన గణపతి విగ్రహాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, పాణ్యం, కోడుమూరు. ఆదోని ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బొగ్గుల దస్తగిరి, పార్థసారథి, జేసీ బి.నవ్య, ఎస్పీ బింధుమాదవ్‌, నగర మేయర్‌ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్‌, ఎస్వీ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన వేలం పాటలో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి రూ.2.35లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం రాంబొట్ల దేవాలయం ప్రాంగణంలో కర్నూలు మరాఠా సేవాసంఘ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని మంత్రి, ఎస్పీ, జేసీ ఇతర ప్రజా ప్రతినిధులు నిమజ్జనం చేశారు.

Updated Date - Sep 15 , 2024 | 11:55 PM

Advertising
Advertising