కారు బోల్తా
ABN, Publish Date - Oct 22 , 2024 | 01:31 AM
కారు బోల్తా పడి, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై పేరాయిపల్లె మెట్ట వద్ద సోమవారం చోటు చేసుకున్నది
ఐదుగురికి తీవ్ర గాయాలు
ఆళ్లగడ్డ(శిరివెళ్ల), అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : కారు బోల్తా పడి, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన కర్నూలు-చిత్తూరు 40వ జాతీయ రహదారిపై పేరాయిపల్లె మెట్ట వద్ద సోమవారం చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరుకు చెం దిన ఓ కుటుంబ సభ్యులు మహానందిలో స్వామి వారిని దర్శించుకుని అహోబిలం వెళ్తుండగా పేరాయిపల్లె వద్ద కారు టైరు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో కారు పల్టీలు కొట్టి డివైడర్‌ను దాటి నంద్యాల వైపు వెళ్లే రహదారిలో బోల్తా పడింది. ఈ ఘటనలో సాయి వెంకటేష్, రమాదేవి, ఝాన్సీ, సుధీర్, శశి తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆళ్లగడ్డ రూరల్ ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
Updated Date - Oct 22 , 2024 | 01:31 AM