కురవలను రాజకీయంగా గుర్తించిన చంద్రబాబు
ABN, Publish Date - May 01 , 2024 | 12:09 AM
జిల్లాలో వెనుకబడిన కురవలను రాజకీయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారని కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు.
ఎంపీ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు
కర్నూలు, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వెనుకబడిన కురవలను రాజకీయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుర్తించారని కర్నూలు ఎంపీ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు అన్నారు. మంగళవారం పత్తికొండ నియోజకవర్గం కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి, సంగాల గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబుతో కలిసి ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వెళ్లిన ఎంపీ అభ్యర్థి నాగరాజుకు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనను ఎంపీగా గెలిపిస్తే హంద్రీనీవా అసంపూర్తి పనులు, ఆర్డీఎస్, వేదవతి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయించి ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తాను అన్నారు. గుండ్రేవుల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయిస్తా అన్నారు.
Updated Date - May 01 , 2024 | 12:09 AM