సీఎంవో ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:41 AM
ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ రాజకుమారి ఫ పీజీఆర్‌ఎస్‌కు 211 వినతులు
నంద్యాల కల్చరల్, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సెంటినరీ హాల్‌లో పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో పాల్లొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించి సరియైున ఎండార్స్‌మెంట్ ఇవ్వడం లేదని 72 గంటలకు మించి ఒక్క గ్రీవెన్స్ కూడా పెండింగ్‌లో ఉండకూడదని స్పష్టం చేశారు. ఏపీ సేవా సర్వీసులకు సంబంధించి 1337 దరఖాస్తులు పెండింగ్ ఉన్నాయని, వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించారు. విభిన్న ప్రతిభావంతులైన ప్రత్యేక అవసరాలు గల ఐదుగురు బదిరులకు టచ్‌స్ర్కీన్ ఫోన్‌లను, ఒకరికి ల్యాప్‌టాప్‌ను కలెక్టర్, జేసీ అందజేశారు. పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో 211 మంది బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలని వినతులను సమర్పించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, డీఆర్వో పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
జనవరి 15లోగా పనులు పూర్తి చేయాలి
పల్లెపండుగ, పంచాయతీ వారోత్సవాలలో జిల్లా వ్యాప్తంగా శంకుస్థాపన చేసిన సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, డ్రైన్లకు సంబంధించిన 1026 పనులను వచ్చే ఏడాది జనవరి 15లోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ వేదికలో భాగంగా సాగు నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు, పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాలు, స్వీప్, ఈ ఆఫీస్, రెవెన్యూ సదస్సులు, 200 వందల రోజుల కార్యాచరణ ప్రణాళిక, కోర్టు కేసులకు సంబంధించిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:41 AM