విరాళాలు సేకరించండి

ABN, Publish Date - Sep 13 , 2024 | 12:47 AM

విజయవాడలోని వరద బాధితల కోసం విరాళాలు సేకరించాలని వెలుగు ఏపీఎం దాసన్న పిలుపునిచ్చారు.

విరాళాలు సేకరించండి
కలెక్టర్‌కు నగదు ఇస్తున్న విద్యార్థులు

ఉయ్యాలవాడ, సెప్టెంబరు 12: విజయవాడలోని వరద బాధితల కోసం విరాళాలు సేకరించాలని వెలుగు ఏపీఎం దాసన్న పిలుపునిచ్చారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో ఆయా గ్రామాల వీవోఏలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి మహిళ కనీసం రూ. 50కు తగ్గకుండా విరాళంగా ఇవ్వాలన్నారు. మండలం నుంచి కనీసం రూ. లక్ష వరద బాధితుల కోసం ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలిపారు. సోమవారం నాటికి వందశాతం పూర్తి అయ్యేలా చూడాలని సిబ్బందికి ఆదేశించారు. కార్యక్రమంలో సీసీలు గంగన్న, నాగన్న ఉన్నారు.

ఫ విజయవాడలోని వరద బాధితులను ఆదుకునేందుకు మండలంలోని బోడెమ్మనూరు గ్రామ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముందుకు వచ్చారు. విద్యార్థులు విరాళాల ద్వారా సేకరించిన రూ. 11 వేలు కలెక్టర్‌ రాజకుమారికి గురువారం అందించారు. వీరిని కలెక్టర్‌ అభినందించారు. వీరి వెంట పాఠశాల ఉపాధ్యాయుడు నారాయణ ఆచారి, పీడీ దాసు ఉన్నారు.

Updated Date - Sep 13 , 2024 | 12:47 AM

Advertising
Advertising