ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రింగ్‌ రోడ్డు పనులు పూర్తి చేయండి: కలెక్టర్‌

ABN, Publish Date - Sep 07 , 2024 | 12:39 AM

బి.తాండ్రపాడు నుంచి గార్గేయ పురం వరకు జరుగుతున్న రింగ్‌ రోడ్డు పనులను నవంబరు 15వతేదీ నాటికి పూర్తి చేయాలని ఎనహెచ-340సీ పీడీనీ కలెక్టర్‌ పి.రంజిత బాషా ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్సలో పాల్గొన్న కలెక్టర్‌ రంజిత బాషా, అధికారులు

కర్నూలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 6: బి.తాండ్రపాడు నుంచి గార్గేయ పురం వరకు జరుగుతున్న రింగ్‌ రోడ్డు పనులను నవంబరు 15వతేదీ నాటికి పూర్తి చేయాలని ఎనహెచ-340సీ పీడీనీ కలెక్టర్‌ పి.రంజిత బాషా ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై నేషనల్‌ హైవే అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎనహెచ-340బికి సంబంధించి సోమయాజులపల్లె నుంచి డోన రూట్‌కు సంబంధించిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కర్నూలు ఆర్డీవోను ఆదేశించారు. ఎనహెచ-167కి సంబంధించి ఆదోని బైపాస్‌ కోసం భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదోని సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, అసిస్టెంట్‌ ట్రైనీ కలెక్టర్‌ చల్లా కళ్యాణి, ఇనచార్జి డీఆర్వో చిరంజీవి, కర్నూలు ఆర్డీవో శేషిరెడ్డి, ఇనచార్జి మున్సిపల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌, ఎనహెచ-340సి పీడీ పద్మ, ఎనహెచ-40 పీడీ అశోక్‌ కుమార్‌, ఎనహెచ-150సీ పీడీ తరుణ్‌ కుమార్‌ పాల్గొన్నారు.

జల సంరక్షణలో ప్రజలు భాగస్వామి కావాలి: ప్రజలు జల సంరక్షణలో భాగస్వామ్యం కావాలని ప్రదాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శుక్రవా రం గుజరాత రాష్ట్రం సూరత జిల్లా నుంచి జల్‌ సంచయ్‌ జన భగీధారి కార్యక్రమాన్ని ప్రధాని వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భం గా ప్రధాని మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా పైపులైన్లు ద్వారా ప్రజలకు పూర్తి స్థాయిలో నీటిని అందజేస్తామన్నారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స హాలు నుంచి కలెక్టర్‌ పి.రంజిత బాషా, ఇనచార్జి మున్సిపల్‌ కమిషనర్‌ రామలిం గేశ్వర్‌, జిల్లా అటవీ శాఖ అధికారి శ్యామల, ఇరిగేషన ఎస్‌ఈ రెడ్డి శేఖర్‌ రెడ్డి, ఆర్‌డబ్లూఎస్‌ ఎస్‌ఈ నాగేశ్వరరావు, డ్వామా పీడీ అమర్నాథ్‌ రెడ్డి పాల్గొన్నారు.

.

Updated Date - Sep 07 , 2024 | 12:39 AM

Advertising
Advertising