మద్యం దుకాణం ఏర్పాటుపై మహిళల ఆందోళన
ABN, Publish Date - Oct 22 , 2024 | 12:42 AM
మండల కేంద్రంలోని పొదుపులక్ష్మి కార్యాలయ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవ ద్దని మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎల్లమ్మ ఆధ్వర్యంలో సోమవారం పొదుపు మహిళలు ఆందోళన చేపట్టారు.
గడివేముల, అక్టోబరు 21(ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలోని పొదుపులక్ష్మి కార్యాలయ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయవ ద్దని మండల సమాఖ్య అధ్యక్షురాలు ఎల్లమ్మ ఆధ్వర్యంలో సోమవారం పొదుపు మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు పొదుపు సంఘం కార్యాలయం ఎదుట రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పొదుపు సంఘం కార్యాలయానికి నిత్యం మహిళలు వస్తుంటారని అన్నారు. కార్యాలయ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే మందుబాబులు పొదుపు సంఘం కార్యాలయం ప్రాంగణంలోనే మద్యం తాగి ఖాళీ సీసాలను విచ్చలవిడిగా పారేస్తున్నార ని అవేదన వ్యక్తం చేశారు. ఇది ఇలానే కొనసాగితే మందుబాబుల ఆగడాలకు హద్దు లేకుండా పోతుందన్నారు. మద్యం దుకాణం ఏర్పాటు చేయవద్దంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ వెంకట రమణకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు వడ్డు లక్ష్మీదేవి, సుభద్రమ్మ, పొదుపు మహిళలు పాల్గొన్నారు.
Updated Date - Oct 22 , 2024 | 12:42 AM