ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘వైసీపీ హయాంలో మా ఆస్తులపై కుట్ర’

ABN, Publish Date - Sep 21 , 2024 | 01:05 AM

వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి కుమ్మక్కై ఆళ్లగడ్డలోని తమ ఆస్తులపై కుట్ర చేశారని దివంగత టీడీపీ నాయకురాలు అట్లా శ్రీదేవి వారసులు అట్లా హర్షవర్ధనరెడ్డి, అట్లా రమ్య శుక్రవారం ఆరోపించారు.

ఆళ్లగడ్డలో ఆధారాలు చూపుతున్న అట్లా శ్రీదేవి వారసులు

ఆళ్లగడ్డ(శిరివెళ్ల), సెప్టెంబరు 20: వైసీపీ హయాంలో మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి కుమ్మక్కై ఆళ్లగడ్డలోని తమ ఆస్తులపై కుట్ర చేశారని దివంగత టీడీపీ నాయకురాలు అట్లా శ్రీదేవి వారసులు అట్లా హర్షవర్ధనరెడ్డి, అట్లా రమ్య శుక్రవారం ఆరోపించారు. పాతబస్టాండ్‌ సమీపంలో తమ పూర్వీకులకు చెందిన ఓ స్థలానికి ఫేక్‌ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని.. ఇదంతా ఏవీ సుబ్బారెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. ఆళ్లగడ్డలో వివాదాస్పదంగా మారిన ఓ చికెన దుకాణం వద్ద శుక్రవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. చికెన దుకాణాన్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించామని వడగళ్ల ఈశ్వరమ్మ అనే వృద్ధురాలు ఎస్పీని ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయంలో వాస్తవం లేదన్నారు. ఆ ఆస్తికి సంబంధించిన నిజమైన వారసులం తామే నని, తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని వారు తెలిపారు. తమకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వద్దకు వెళ్లామని.. ఈ ఘటనలో ఎమ్మెల్యే అఖిలప్రియ దంపతులపై బురదజల్లేందుకు యత్నించడం సమంజసం కాదని అన్నారు. ఆళ్లగ డ్డలో ఓ చిన్న చికెన దుకా ణానికి సంబంధించి ఇంత చొరవ చూపుతున్న పోలీ సులు.. మా అమ్మ అట్లా శ్రీదేవి హత్య కేసులో నిందితుడైన ఏవీ సుబ్బా రెడ్డిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

Updated Date - Sep 21 , 2024 | 01:05 AM