ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రంథాలయాల పురోభివృద్ధికి సహకరిస్తా

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:56 PM

జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు అన్నారు.

ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

ఎంపీ బస్తిపాటి నాగరాజు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గ్రంథాలయాల పురోభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీ నాగరాజు తొలుత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ చిత్రపటానికి, గ్రంథాలయ ఉద్యమానికి కృషిచేసిన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గ్రంథాలయాల ద్వారా ఎందరో విద్యార్థులు పోటీ పరీక్షలకు సిద్ధం కావచ్చని చెప్పారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు కల్పించిన ఏర్పాట్లను ఆయన అభినందించారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే విద్యార్థుల్లో చైతన్యం పెరుగుతుందని అన్నారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యార్థుల ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు కేసీ కల్కూర, కేజీ గంగాధర్‌రెడ్డి, ముచ్చుకోట చంద్రశేఖర్‌, కార్యదర్శి కె. ప్రకాశ్‌, ఉప గ్రంథాలయ అధికారి వి. పెద్దక్క, గ్రంథాలయ అధికారులు వజ్రాల గోవిందరెడ్డి, ఎస్‌ బాషా పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2024 | 11:56 PM