ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వివాదాల ఆలూరు

ABN, Publish Date - Nov 21 , 2024 | 12:09 AM

ఆలూరు పోలీసు సర్కిల్‌ స్టేషన్‌ వివాదాలకు నిలయంగా మారింది. విధుల్లో చేరిన నాలుగు నెలలకే ఇద్జరు పోలీసు అధికారులు వీఆర్‌లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది.

విధుల్లో చేరిన నాలుగు నెలలకే వీఆర్‌లోకి ఇద్జరు పోలీసు అధికారులు

అధికారుల మధ్య విభేదాలకు ఆజ్యం పోస్తున్న కింది స్థాయి ఉద్యోగులు

ఆలూరు, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి) : ఆలూరు పోలీసు సర్కిల్‌ స్టేషన్‌ వివాదాలకు నిలయంగా మారింది. విధుల్లో చేరిన నాలుగు నెలలకే ఇద్జరు పోలీసు అధికారులు వీఆర్‌లోకి వెళ్లడం చర్చనీయాంశమైంది. అధికార పార్టీలో నేతల మధ్య ఉన్న వర్గ విభేదాల కారణంగా నాలుగు నెలల వ్యవధిలో సీఐ శ్రీనివాస నాయక్‌, ఎస్‌ఐ వెంకట నరసింహులు వీఆర్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఆలూరు సర్కిల్‌ సీఐగా శ్రీనివాస నాయక్‌, ఎస్సైగా వెంకట నరసింహులుకు అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే, టీడీపీ ముఖ్య నేత ఒకరు కలిసి పోస్టింగ్‌ ఇప్పించారు. అయితే అదే పార్టీలో ఉన్న మరో నేతకు పోలీసు స్టేషన్‌లో వారి పెత్తనం మింగుడు పడలేదు. పోలీసులు తాము చెప్పిన పని చేయడం లేదని జిల్లా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో ఇద్దరు పోలీసు అధికారులు ఒకే వర్గానికి పని చేసి విధంగా వ్యవహరిస్తున్నారని చర్యలు తీసుకున్నారు.

ఇద్దరు అధికారుల వీఆర్‌కు కారణాలెన్నో..?

ఆలూరు పోలీసు సర్కిల్‌లో ఇద్దరు పోలీసు అధికారులపై చర్యలకు అవినీతి ఆరోపణలు కారణమని పోలీసు ఉన్నతాధికారులు చెబుతుండగా మరో అంశం కూడా తెరపైకి వచ్చింది. వాస్తవంగా నియోజకవర్గంలో పేకాట స్థావరాలపై ఓ అధికార పార్టీ నేత పోలీసులకు సమాచారం ఇచ్చి అరెస్టు చేయించగా అందులో మరో నేత అనుచరులు పట్టుబడ్డారు. దీంతో ఇద్దరి నేతల మధ్య వర్గాల మధ్య ఈ ఘటన ఆజ్యం పోసినట్టయింది. తమ అనుచరులనే అరెస్టు చేస్తారా అంటూ ఓ నేత పోలీసుల తీరుపై ఆగ్రహించినట్లు సమాచారం. మరో వైపు ఓ టీడీపీ నేత ఫిర్యాదు మేరకు ఆలూరులోని క్లబ్‌ను ఎస్సై మూసివేయడంతో మరోవర్గం నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అధికార పార్టీ వర్గ పోరు వల్లే ఆలూరు పోలీసు స్టేషన్‌లో ఇద్దరు అధికారులు బలి అయినట్లు తెలుస్తోంది.

సీఐ, ఎస్సై మధ్య విభేదాలకు ఆజ్యం పోసిన చిన్న బాస్‌లు

ఆలూరు పోలీసు స్టేషన్‌లో సీఐ శ్రీనివాస నాయక్‌, ఎస్సై వెంకట నరసింహులు మధ్య విభేదాలు ఏర్పడటానికి అందులో ఉన్న సీనియర్‌ కానిస్టేబుల్‌ ఒకరు, మరో చిన్న బాసులే కారణమని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. ఎస్సైను వీఆర్‌కు పంపుతూ ఆయన స్థానంలో సత్య సాయి జిల్లాలో వీఆర్‌లో ఉన్న దిలీప్‌ కుమార్‌ను నియమిస్తూ ఈ నెల 12నా డీఐజీ కోయ ప్రవీణ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ ఇద్దరు సిబ్బంది సంబరాలు చేసుకున్నట్లు సమాచారం.

ఎస్సై వీఆర్‌ను నిలుపుదల చేసేందుకు అన్ని వర్గాల యత్నాలు

‘విధుల్లో చేరి మూడు నెలలు కూడా పూర్తి కాలేదు.. అన్ని వర్గాలు, అధికారులకు పని చేశాను, ఏం తప్పు చేశానని వీఆర్‌కు పంపించారు.. మీరే సహాయం చేయండి’ అంటూ సదరు ఎస్సై అధికార పార్టీలోని ముఖ్యనేతల ఎదుట వాపోయినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన ఓ ఎమ్మెల్యే ఇద్దరు అధికార పార్టీ ముఖ్య నేతలు ఉన్నతాధికారులతో ఎస్సైను బదిలీ చెయ్యొద్దని కోరగా ఉన్నత అధికారులు ససేమీరా అన్నట్లు తెలిసింది. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సీఐ వెంకట చలపతి, ఎస్సై దీలీప్‌ కుమార్‌లు ఎన్ని రోజులు కొనసాగుతారో చూడాలి. అధికారుల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఆ ఇద్దరు సిబ్బందిపై కూడా ఇంటెలిజెన్స్‌ నివేదికలు జిల్లా ఉన్నత అధికారులకు వెళ్లాయి. వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందని పోలీసు వర్గాల సమాచారం.

Updated Date - Nov 21 , 2024 | 12:09 AM