ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లా పరిషత్‌లో ముగిసిన బదిలీల కౌన్సెలింగ్‌

ABN, Publish Date - Aug 29 , 2024 | 11:48 PM

జిల్లా పరిషత్‌ ఆవరణలో గురువారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌ ముగిసింది.

కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న అధికారులు

కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 29: జిల్లా పరిషత్‌ ఆవరణలో గురువారం నిర్వహించిన బదిలీల కౌన్సెలింగ్‌ ముగిసింది. జడ్పీలోని సమావేశ భవనంలో పంచాయతీ కార్యదర్శులు, వెల్ఫేర్‌ కార్యదర్శుల కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. విశ్వేశ్వరయ్య భవన్‌లో ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లకు కౌన్సెలింగ్‌ చేపట్టారు. పీఆర్‌ ఎస్‌ఈ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో ఈఈలు, డీఈఈలు బదిలీల ప్రక్రియ చేశారు. అదేవిధంగా సమావేశ భవనంలో సోషల్‌ వెల్ఫేర్‌ జాయింట్‌ డైరెక్టర్‌ వెల్ఫేర్‌ కార్యదర్శులకు, నంద్యాల, కర్నూలు జిల్లా పంచాయతీ అధికారులు మంజుల వాణి, టీవీ నాగరాజు నాయుడు కార్యదర్శులకు బదిలీ కౌన్సెలింగ్‌ చేశారు. అయితే బదిలీ అయన వారంతా వచ్చే నెల పింఛన్‌ పంపిణీ అనంతరం రిలీవ్‌ కావాలని ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

చిన్నారులతో తల్లులు

ఉమ్మడి జిల్లాకు సంబంఽధించి జిల్లా పరిషత్‌ ఆవరణలో జరిగిన సచివాలయ ఉద్యోగుల బదిలీల కౌన్సెలింగ్‌కు తల్లులు చిన్నారులను ఎత్తుకుని వచ్చారు. తల్లి కౌన్సెలింగ్‌ కోసం సమావేశ భవనంలోకి వెళితే తండ్రి చిన్నారిని ఎత్తుకుని ఆడించుకుంటున్నారు. సుమారు 20 నుంచి 30 మంది చిన్నారుల తల్లులు బదిలీల ప్రక్రియలో పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2024 | 11:48 PM

Advertising
Advertising