మట్కా, గంజాయిపై ఉక్కుపాదం: డీఐజీ
ABN, Publish Date - Aug 29 , 2024 | 12:59 AM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మట్కా, గంజాయిలపై ఉక్కుపాదం మోపుతామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు.
డోన, ఆగస్టు 28: ఉమ్మడి కర్నూలు జిల్లాలో మట్కా, గంజాయిలపై ఉక్కుపాదం మోపుతామని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అన్నారు. బుధవారం డోన డీఎస్పీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ అధిరా జ్‌సింగ్ రాణాతో కలిసి డీఐజీ తనిఖీ చేశారు. అంతకుముందు వారు పోలీసుల గౌరవ వం దనాన్ని స్వీకరించారు. డోన సబ్ డివిజనలో కేసుల వివరాలను డీఎస్పీ శ్రీని వాసులును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ డోన సబ్ డివిజనలో మట్కా, పేకాట, గంజాయి, అక్రమ మద్యం వంటి అసాంఘిక కార్యకలా పాలు లేకుండా చేస్తామన్నారు.
బనగానపల్లె: బనగానపల్లె పోలీస్‌స్టేషనకు బుధవారం డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ అధిరాజ్ సింగ్‌లు తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని శాంతి భద్రతలపై పోలీస్ అధికారులతో చర్చించారు. రౌడీషీటర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు ఆదేశించారు. దొంగతనాలపై ప్రత్యేక నిఘా ఉంచాల న్నారు. బనగానపల్లె నియోజకవర్గంలో శాంతిభద్రతలపై ఆరా తీశారు. కార్య క్రమంలో డోన డీఎస్పీ శ్రీనివాసులు, బనగానపల్లె, డోన సీఐలు మంజు నాథ్‌రెడ్డి, కృష్ణయ్యయాదవ్, రాకేశ పాల్గొన్నారు.
చాగలమర్రి: కర్నూలు రేంజి పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై పోలీసు ప్రత్యేక నిఘా ఉందని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. బుధవారం సాయంత్రం చాగలమర్రి పోలీసు స్టేషనను ఎస్పీ అధిరాజ్‌సింగ్ రాణాతో కలిసి సందర్శించారు. పోలీసు స్టేషన పరిసరాలను పరిశీలించారు. నేరాల గురించి అడిగి తెలుసుకున్నారు.ఆళ్లగడ్డ రూరల్ సీఐ కంబగిరి రాముడు, ఎస్‌ఐలు రమేష్‌రెడ్డి, హరిప్రసాద్, ఏఎస్‌ఐ నబీసాహెబ్, పోలీసులు ఉన్నారు.
Updated Date - Aug 29 , 2024 | 12:59 AM