క్రమబద్ధ జీవనంతోనే మధుమేహం దూరం
ABN, Publish Date - Nov 15 , 2024 | 12:54 AM
క్రమబద్ధ జీవ నంతోనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ అన్నారు.
మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ
కర్నూలు హాస్పిటల్, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): క్రమబద్ధ జీవ నంతోనే మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చిట్టి నరసమ్మ అన్నారు. గురువారం వరల్డ్ డయాబే టిక్ డే సందర్భంగా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓల్డ్ సీఎల్‌బీలో ఎండోక్రైనాలజీ విభాగం ఆధ్వర్యంలో నర్సులకు మెడికల్ ఎడ్యుకేషన కార్యక్రమం జరిగింది. ఈ సదస్సును ప్రిన్సిపాల్, కర్నూలు జీజీహెచ సూపరింటెండెంట్ కే.వెంకటేశ్వర్లుతో కలిసి ప్రారంభించారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ డయాబేటిక్ రోగుల సంరక్షణలో నర్సింగ్ సేవలు కూడా ముఖ్యమన్నారు. ఎండోక్రైనాలజీ హెచఓడీ డాక్టర్ పి.శ్రీని వాసులు మాట్లాడుతూ మధుమేహానికి పూర్తి స్థాయిలో మందులు అందుబాటులో ఉన్నాయని, రోగులు క్రమం తప్పకుండ మందులు వాడి షుగర్ పరీక్షలు రెగ్యులర్‌గా చేయించుకోవాలని సూచించారు. కార్యక్ర మంలో ఎండోక్రైనాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధారాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు పాల్గొన్నారు.
బెల్లం తిన్నా మధుమేహం వస్తుంది: పంచదార బదులు బెల్లం, కలకండ తిన్నా మధుమేహం వస్తుందని ఎండ్రోకైనాలజిస్టు హెచవోడీ ప్రొఫెసర్ పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం పెద్దాసుప్రతిలో వరల్డ్ డైయాబెటిక్ డే సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రాధికా రాణితో కలిసి నర్సింగ్ బీఎస్సీ, జీఎనఎం నర్సింగ్ విద్యార్థులకు అవగా హన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ గర్భిణులకు షుగర్ ఉంటే మాత్రలు వాడాలా లేదా ఇన్సులిన ఇవ్వాలా అని అడిగారు. ఈ ప్రశ్నకు ఆయన సమాధాన ఇస్తూ కేవలం ఇన్సులిన మాత్రమే వాడాలని సూచించారు. వంశపారంపర్యంగా షుగర్ వస్తుందా అన్న విద్యార్థుల ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తల్లిదండ్రులకు మధుమేహం ఉంటు పిల్లలకు 90 శాతం వస్తుందని తెలిపారు. అదే తల్లిదండ్రుల్లో ఒకరికి మాత్రమే ఉంటే వారి పిల్లలకు 70 శాతం వచ్చే అవకాశం ఉందని వివరించారు. షుగర్ లెస్ స్వీట్లు అసలు తినకూడదని, ఆ పదార్థాల్లో కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, అవి తింటే చక్కెర స్థాయి పెరుగుతుందని చెప్పారు.
Updated Date - Nov 15 , 2024 | 12:54 AM