రసాభాసగా కౌన్సిల్
ABN, Publish Date - Dec 01 , 2024 | 12:14 AM
పట్టణ పురపాలక సంఘం సమావేశం రసాభాసగా ముగిసింది. అజెండా చర్చకు రాకుండనే మమ అనిపించారు.
దద్దరిల్లిన ఆదోని మున్సిపల్ కౌన్సిల్ సమావేశం
అజెండా పూర్తి కాకుండానే ముగింపు
ఆదోని టౌన్, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పట్టణ పురపాలక సంఘం సమావేశం రసాభాసగా ముగిసింది. అజెండా చర్చకు రాకుండనే మమ అనిపించారు. శనివారం చైర్‌పర్సన్ వాల్మీకి శాంత అధ్యక్షతన శనివారం మునిసిపల్ కౌన్సిల్ సాదారణ సమావేశాన్ని నిర్వహించారు. ఇద్దరు వైస్ చైర్మన్లు కూడా కౌన్సిలర్లతో పాటే కూర్చొనేలా ఏర్పాటు చేయడంతో వైసీపీ కౌన్సిలర్లు పోడియం ముందు బైఠాయించి చైర్‌పర్సన్‌పై ధ్వజమెత్తారు. కౌన్సిలర్లు కింద కూర్చోవడంతో, అధికారులు కూడా సమావేశం ముగిసే వరకు నిలబడే ఉన్నారు. కౌన్సిలర్ వెల్లాల లలిత శర్మ మాట్లాడుతూ, రెండు నెలలుగా కూర్చీల పెట్టుకుని అభివృద్ధి పనులపై చర్చించడం లేదని విమర్శించారు. తన వార్డు సమస్యలపై తన భర్త ఇంజనీర్‌ను కలిస్తే, నీఛంగా మాట్లాడారని ప్రజా ప్రతినిధులకు అధికారులు ఇచ్చే గౌరవం ఇదేనా? అని ఆవేశంతో ప్రశ్నించారు. దీంతో కమిషనర్, ఎంఈ క్షమాపణలు కోరడంతో శాంతించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలో అవినీతిపై పూర్తి విచారణ జరిపించాలని బీజేపీ మద్దతుదారులైన వైసీపీ కౌన్సిలర్లు వెల్లాల లలిత శర్మ, సురేష్, చిన్న, వసీం, ప్ల కార్డులతో తమ నిరసన వ్యక్తం చేసారు. ఒక దశలో వైస్ చైర్మన్ నరసింహులు, కౌన్సిలర్ లలితశర్మ మధ్య తీవ్రంగా వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. 35వ అంశాన్ని ఆమోదించి, ప్రభుత్వానికి పంపకుంటే నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని కమిషనర్ చెప్పడంతో కౌన్సిలర్లు అమోదించారు. వైసీపీకి చెందిన చైర్‌పర్సన్‌కు, అదే పార్టీకు చెందిన ఇతర కౌన్సిలర్లకు మధ్య చైర్మన్ పదవిపై వివాదంతో నాలుగు నెలలుగా సమావే శాలు గందరగోళంగా మారాయని సమస్య లపై చర్చించడంలేదని స్థానికులు విమర్శసిస్తున్నారు.
Updated Date - Dec 01 , 2024 | 12:14 AM