ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యురేనియం తవ్వకాలు జరగనివ్వం

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:55 AM

యురేనియం తవ్వకాలను జరగనివ్వబోమని దేవనకొండ మండల ప్రజలు తేల్చి చెప్పారు. మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వ్‌ ఫారెస్టులో యురేనియం తవ్వకాలు చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కప్పట్రాళ్ల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాళ్ల, చెలెల్ల చిలిమిలా, బేతపల్లి గ్రామాల ప్రజలు సోమవారం కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు.

కలెక్టరేట్‌కు భారీగా తరలి వచ్చిన యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు

తవ్వకాలు చేయబోమని ప్రకటించాలి: నాయకుల డిమాండ్‌

కర్నూలు న్యూసిటీ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): యురేనియం తవ్వకాలను జరగనివ్వబోమని దేవనకొండ మండల ప్రజలు తేల్చి చెప్పారు. మండలంలోని కప్పట్రాళ్ల రిజర్వ్‌ ఫారెస్టులో యురేనియం తవ్వకాలు చేసేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో కప్పట్రాళ్ల, కోటకొండ, నెల్లిబండ, గుండ్లకొండ, గుడిమరాళ్ల, చెలెల్ల చిలిమిలా, బేతపల్లి గ్రామాల ప్రజలు సోమవారం కలెక్టరేట్‌ ముందు ఆందోళనకు దిగారు. ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ముందుగా సుందరయ్య కూడలి నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీగా వచ్చారు. కలెక్టరేట్‌ ఎదుట కొద్దిసేపు రాస్తారోకో నిర్వహించారు. పచ్చని గ్రామాల్లో చిచ్చుపెడుతున్నారని, యురేనియం తవ్వకాలపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు వద్దని, తమ పిల్లల భవిష్యత్తును కాపాడాలని నినాదాలు చేశారు. ఈ సందర్బంగా శ్రామిక మహిళా సంఘం రాష్ట్ర నాయకులరాలు నిర్మలమ్మ మాట్లాడుతూ 20 రోజుల నుంచి మండల ప్రజానీకం తీవ్ర ఆందోళనతో ఉద్వేగానికి గురవుతున్నారన్నారు. కలెక్టర్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే అందరు వెళ్లిపోతారని అన్నారు. అనంతరం జాయింట్‌ కలెక్టర్‌ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రస్తుతం ఎలాంటి తవ్వకాలు చేపట్టడం లేదన్నారు. ప్రజాభిప్రాయం మేరకే యురేనియం తవ్వకాలపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజల ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి రామక్రిష్ణ, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌.రాధాక్రిష్ణ, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

కప్పట్రాళ్ల చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక అండగా ఉంటుందని వేదిక కన్వీనర్‌ రామక్రిష్ణారెడ్డి అన్నారు. ఐక్యవేదిక అధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యురేనియం తవ్వకాలు నిలుపుదల చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని అన్నారు. యురేనియం తవ్వకాల వల్ల గాలి, నీరు, వాతావరణ పర్యావరణం పంటలు మొత్తం కలుషితమవుతుందని తెలిపారు. ప్రజల కోసం ప్రజాప్రతినిధులు వారి పదవులు త్యాగం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, నాయకులు శ్రీనివాసరావు, రైతుసంఘం రాష్ట్ర కార్యదర్శి కే జగన్నాథం, ఎస్‌డీపీఐ జిల్లా నాయకులు చాంద్‌బాషా, వకీల్‌ బాషా, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:55 AM