న్యాయ సంస్థలను కర్నూలు నుంచి తరలించొద్దు
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:41 AM
మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సి), ఏపీ లోకయుక్త కోర్టులను కర్నూలు నుంచి తరలించొద్దని ఆదోని బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎల్.కె.సుందర్ సింగ్, ఉపాధ్యక్షుడు మొలగవల్లి జనార్థన్ డిమాండ్ చేశారు.
ఆదోని, పత్తికొండ బార్ అసొసియేషన్లు
ఆదోని రూరల్ నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): మానవ హక్కుల కమిషన్ (ఎస్‌హెచ్‌ఆర్‌సి), ఏపీ లోకయుక్త కోర్టులను కర్నూలు నుంచి తరలించొద్దని ఆదోని బార్ అసొసియేషన్ అధ్యక్షుడు ఎల్.కె.సుందర్ సింగ్, ఉపాధ్యక్షుడు మొలగవల్లి జనార్థన్ డిమాండ్ చేశారు. మంగళవారం అసొసియేషన్ కార్యాలయంలో మాట్లాడుతూ వీటిపై అసెంబ్లీలో చర్చించాలన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి, సీఎం ఇచ్చిన హాని నిలబెట్టుకోవాలన్నారు. ఈనెల 22వరకు విధులను బహిష్కరిస్తున్నట్లు తీర్మానం చేశారు. జనరల్ సెక్రటరీ సురేంద్ర, సెక్రటరీ మల్లికార్జున, ట్రెజరర్ లతీఫ్, కలందర్, సునీతారెడ్డి, విరుపాక్షిరెడ్డి, వై.ఆర్ మల్లికార్జున, శ్రీధర్‌రెడ్డి, రంగన్న, తాయన్న, రామాంజనేయులు, రామలింగ, న్యాయవాదులు పాల్గొన్నారు.
న్యాయవాదుల విధుల బహిష్కరణ
పత్తికొండ టౌన్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి):
న్యాయ సంస్థలను కర్నూలు నుంచి తరలించ డాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రంగస్వామి మహేష్, సీనియర్ న్యాయవాదులు ఎల్లారెడ్డి, సత్యనారా యణ, శేఖర్, సురేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం పత్తికొండలో న్యాయ వాదులు విధులను బహిస్కరించారు. శ్రీభాగ్ ఒప్పందం మేరకు గత ప్రభుత్వం కర్నూలులో ఏర్పాటు చేసిన లోకాయుక్త, జాతీయ మానవ హక్కుల కమిషన్‌తో పాటు వక్ఫ్ ట్రిబ్యునల్‌ను అమరావతికి తరలించలాన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం సబబు కాదన్నారు. గత ఎన్నికల్లో కర్నూలులో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాట చేస్తామన్న హామీని సీఎం చంద్రబాబు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు రవికుమార్, సహాయ కార్యదర్శి వాసు, కోశాధికారి రాజశేఖర్, న్యాయవాదులు హుల్తన్న, నరసింహయ్య పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:41 AM