ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరద బాధితులకు విరాళాలు

ABN, Publish Date - Sep 06 , 2024 | 01:30 AM

విజయవాడ వరద బాధితులకు శిరివెళ్ల మండల టీడీపీ నాయకులు భారీ విరాళం అందజేశారు.

ఎమ్మెల్యే అఖిలప్రియకు నగదును అందజేస్తున్న టీడీపీ నాయకులు

శిరివెళ్ల, సెప్టెంబరు 5: విజయవాడ వరద బాధితులకు శిరివెళ్ల మండల టీడీపీ నాయకులు భారీ విరాళం అందజేశారు. టీడీపీ మండల కన్వీనర్‌, మాజీ ఎంపీపీ కాటంరెడ్డి శ్రీకాంతరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు రూ.2,28,600 విరాళాన్ని విజ యవాడ వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి చేర్చాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆళ్లగడ్డలో గురువారం అంద జేశారు. మాజీ జడ్పీటీసీ యామా గుర్రప్ప, ప్రధాన కార్యదర్శి మురళి, బీసీ ఖాజా హుసేన, ఫిదా హుసేన, సిద్ధిఖ్‌, రాంపుల్లయ్య, శ్రీనివాసరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, శివరామిరెడ్డి తదితరులు ఉన్నారు.

దొర్నిపాడు: వరద బాధితుల కోసం సీఎం సహాయ నిధి కింద గురువారం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు చాకరాజువేముల టీడీపీ నాయకులు రూ.43 వేలు విరాళం అందజేశారు. చాకరాజువేముల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు లింగుట్ల వెంకట్‌నాయుడు, పుల్లయ్య నాయుడు, ఎండూరి గోపాల్‌నాయుడు, బరిగెల నరసింహుడు, క్రిష్ణగుర్రప్ప యాదవ్‌, నారాయణస్వామి, దొర్నిపాడు సొసైటీ మాజీ అధ్యక్షుడు సిద్ధి సత్యం, శ్రీనివాసులు తమ వంతుగా వరద బాధితుల సహాయం కోసం విరాళం అందజేశారు.

చాగలమర్రి: విజయవాడ వరద బాధితుల కోసం తమ వంతు సహాయంతో సీఎం సహాయ నిధికి ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో చాగలమర్రి మండల కన్వీనర్‌ నరసింహారెడ్డి, ఆయా గ్రామాల టీడీపీ నాయకులు కలిసి రూ.1.60 లక్షలు విరాళంగా అందజేశారు. మల్లేవేముల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు రూ.60 వేలు, రాంపల్లి, తోడెండ్లపల్లె, పెద్దవంగలి, చింతలచెరువు, నేలంపాడు, చక్రవర్తులపల్లె, చిన్నవంగలి గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు కలిసి రూ.లక్ష విరాళం ఎమ్మెల్యేకు అందజేశారు.

ఆళ్లగడ్డ: వరద బాధితులకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ గురువారం ఆర్థిక సాయం అందించారు. రుద్రవరం టీడీపీ మండల నాయకులు రూ1.80 లక్షలు, ఉయ్యాలవాడ టీడీపీ మండల నాయకులు రూ.లక్ష, నియో జకరవర్గంలోని విద్యా సంస్థలు రూ.లక్ష, వ్యాపారులు రూ.2 లక్షలు, రైతులు ఇచ్చిన బియ్యం, కందిబేడలను సీఎం సహాయ నిధికి అందజేశారు.

Updated Date - Sep 06 , 2024 | 01:30 AM

Advertising
Advertising