విజయవాడ వరద బాధితులకు విరాళాలు
ABN, Publish Date - Sep 18 , 2024 | 12:26 AM
విజయవాడ వరద బాధితులకు మంగళ వారం మాఽధవీనగర్లోని గౌరు స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కు టీడీపీ నాయకులు చెక్కులు అందజేశారు.
కల్లూరు, సెప్టెంబరు 17: విజయవాడ వరద బాధితులకు మంగళ వారం మాఽధవీనగర్లోని గౌరు స్వగృహంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత కు టీడీపీ నాయకులు చెక్కులు అందజేశారు. కల్లూరు అర్బన 33వ వార్డు టీడీపీ నాయకులు ఎన్వీ. రామకృష్ణ, రైతుసంఘం నేత సంపతి లక్ష్మీరెడ్డి, పోలిరెడ్డి, వరద బాధితుల సహాయార్థం రూ.1,40,000 చెక్కును అందజే శారు. లక్ష్మీపురం గ్రామ ప్రజలు రూ.1,55,555, రాజ్‌కిరణ్ రోడ్ లైన్స ట్రాన్స పోర్టు సంస్థ యజమాని రవీందర్ రూ.10వేలు, బన్నూరుకు చెందిన టీడీపీ నాయకులు అశోక్‌రెడ్డి, బొమ్మిరెడ్డి, హరినాథరెడ్డి, పెరుగు దుర్గాప్రసాద్ రెడ్డి, పగిడ్యాల రాజశేఖర్ రెడ్డి రూ.80 వేలు, 19వ వార్డు టీడీపీ ఇనచార్జి ప్రభాకర్ యాదవ్ రూ.25 వేలు, పందిపాడు టీడీపీ నాయకుడు అయ్యపు రెడ్డి రూ.25 వేలు, గడివేముల మండలం కరిమద్దెల గ్రామ టీడీపీ నాయకులు రూ.90,600, పాణ్యం మండలం, నెరవాడ గ్రామ టీడీపీ నాయకులు రూ.50 వేలు, రేమడూరు గ్రామ ప్రజలు రూ.10,016, టీడీపీ నీయకుడు కురువ ధనుంజయ రూ.15,016, పర్ల గ్రామ నాయకులు రూ. 2,51,116, కల్లూరు మండలం, నెరవాడ టీడీపీ నాయకులు రూ.28వేలు, చెట్లమల్లాపురం గ్రామ నాయకులు రూ.50 వేలు, పుసులూరు టీడీపీ నాయకుడు కృష్ణ రూ. 29, 500, చెక్కులను ఎమ్మెల్యేకు అందజేశారు. అదే విధంగా కల్లూరు మండలం టీడీపీ అధ్యక్షుడు డి.రామాంజినేయులు రూ.60,660, 34వ వార్డు టీడీపీ నాయకుడు పీయూ మాదన్న రూ.25వేలు, 28వ వార్డు దూపాడు ప్రజలు రూ.20,100, సల్కాపురం టీడీపీ నాయకుడు దేవేందర్ రెడ్డి 1,10,116, యాపర్లపాడు గ్రామ ప్రజలు రూ.20 వేలు, ఓర్వ కల్లు మండలం, శకునాల గ్రామ టీడీపీ నాయకులు రూ.20 వేలు, ఉయ్యా లవాడ టీడీపీ నాయకులు డి.రమణారెడ్డి రూ.10 వేలు నగదును పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితకు అందజేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కర్నూలు మార్కెట్ యార్డు మాజీ చైర్మన పెరుగు పురుషోత్తమరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్ పాల్గొన్నారు.
Updated Date - Sep 18 , 2024 | 12:26 AM