క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోవద్దు
ABN, Publish Date - Nov 12 , 2024 | 12:39 AM
క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోకుండా కక్షలు వీడి ప్రశాంతంగా జీవించాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు.
పెద్దకడబూరు, నవంబరు 11 (ఆంధ్ర జ్యోతి) : క్షణికావేశంతో జీవితాలను నాశనం చేసుకోకుండా కక్షలు వీడి ప్రశాంతంగా జీవించాలని డీఎస్పీ ఉపేంద్రబాబు సూచించారు. సోమవారం మండల పరిధిలోని కల్లుకుంట గ్రామంలోని సీఐ మంజునాథ్, ఎస్‌ఐ నిరంజన రెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్థులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు గోడవలకు దూరంగా ఉండాలని, లేకపోతే జీవితాలను నాశనం చేసుకోని కేసులు నమోదు అవుతాయన్నారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోని రోడ్డు ప్రమాదాలు నివారించాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల వల్ల మోసపోయిన వారు వెంటనే 1930 నెంబర్‌కు ఫోన చేసి ఫిర్యాదు చేయాలన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 12:39 AM