సైబర్ ఉచ్చులో పడొద్దు
ABN, Publish Date - Nov 30 , 2024 | 12:15 AM
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని తహసీల్దార్ ఎస్.రవి, సీఐ రామాంజులు అన్నారు.
మంత్రాలయంలో పోస్టర్లు విడుదల చేసిన అధికారులు
మంత్రాలయం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని తహసీల్దార్ ఎస్.రవి, సీఐ రామాంజులు అన్నారు. శుక్రవారం రాఘవేంద్ర సర్కిల్‌లో ఆదోని ఆర్టీవో దీప్తి, ఎస్‌ఐ పరమేష్ నాయక్, హైవే రోడ్డు ఏఈ సురేష్‌తో కలిసి వారు అవగాహన కరపత్రా లను ఆవిష్కరించారు. ఆటోలు, బస్సులకు ప్రధాన కూడళ్లల్లో వాటిని అతికించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫోన్లకు ఓటీపీలు, ఫేస్‌బుక్, ఇనస్ర్టా, వాట్సాప్‌లలో వచ్చే లింకులు, నెంబర్లతో గుర్తు తెలియని వ్యక్తులు పంపే సందేశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు భీమన్నగౌడు, భీముడు, ప్రభాకర్, డిప్యూటీ తహసీల్దార్ బీకే గురురాజరావు, ఆర్‌ఐ ఆదాం, రామకృష్ణ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు రూరల్: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు తెలిపారు. శుక్రవారం కర్నూలు రహదారిలోని బాటమారెమ్మగుడి సమీపంలో ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. కరపత్రాలను పంచారు. కార్యక్రమం లో రూరల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Updated Date - Nov 30 , 2024 | 12:15 AM