ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

8న సాగునీటి సంఘాల ఎన్నిక

ABN, Publish Date - Nov 30 , 2024 | 11:50 PM

నంద్యాల జిల్లా వ్యాప్తంగా 8వ తేదీన సాగునీటి సంఘాల ఎన్నిక జరుగుతుందని కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు.

ఎన్నికల నిర్వహణ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాజకుమారి

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల కల్చరల్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): నంద్యాల జిల్లా వ్యాప్తంగా 8వ తేదీన సాగునీటి సంఘాల ఎన్నిక జరుగుతుందని కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని ఆమె అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాలులో సాగునీటి వినియోగదారుల సంఘాల ఎన్నికల నిర్వహణపై ఓరియంటేషన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ రాజకుమారి మాట్లాడుతూ డిసెంబరు 5న సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రకటన వెలువడుతుందని డిసెంబరు 8వతేదీ నాడు ఎన్నికల ప్రక్రియ ఉంటుందన్నారు. కేసీ కాల్వ కింద 52, ఎస్సార్బీసీ కింద 50, తెలుగుగంగ కింద 47, శివభాష్యం ప్రాజెక్ట్‌ కింద 7, మైనర్‌ ఇరిగేషన్‌ ట్యాంకుల కింద 104, మైలవరం కింద ఒకటి వెరసి మొత్తం 261 నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన వ్యక్తిని ఎన్నుకోవడానికి రైతులు చేతులెత్తి తమ ఆమోదాన్ని తెలపాలన్నారు. 11వతేదీన డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 14వ తేదీన ప్రాజెక్టు కమిటీలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ విష్ణుచరణ్‌, డీఆర్వో రామునాయక్‌, ఆర్డీఓలు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఇరిగేషన్‌ శాఖ ఎస్‌ఈ సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 11:50 PM