ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వాలి’

ABN, Publish Date - Jun 06 , 2024 | 11:52 PM

సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన కూటమి ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్‌ కోరారు.

మాట్లాడుతున్న సుధాకర్‌

నంద్యాల (నూనెపల్లె), జూన్‌ 6: సార్వత్రిక ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన కూటమి ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్టీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుమార్‌ కోరారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. చంద్రబాబు ఆధ్వర్యలంలో ఏర్పడననున్న రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్య, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పాఠశాల విద్యకు తీవ్ర నష్టం కలిగించే జీవో 117ను రద్దు చేసి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కాపాడాలని కోరారు. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ, ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంతో పాటు తెలుగు మాధ్యమాన్ని సమాంతరంగా కొనసాగించాలని కోరారు. గత ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులపై కక్ష పూరిత ధోరణితో పెట్టిన కేసులను, సస్పెన్షన్‌లను ఎత్తి వేయాలన్నారు. కార్యక్రమంలో మాతృనాయక్‌, నాగరాజు, రాము, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 11:52 PM

Advertising
Advertising