ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బడిలో పండుగ

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:10 AM

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

జిల్లాలో 1,457 పాఠశాలలు..

నిర్వహణకు రూ.47.45 లక్షల నిధులు

నేడు మెగా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం

కర్నూలు ఎడ్యుకేషన్‌, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన పాఠశాల విద్యను అభివృద్ధి చేసేందుకు నడుం బిగించింది. వీటి అభివృద్ధిలో విద్యార్థుల తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వాములు అయ్యేలా పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశానికి శ్రీకారం చుట్టింది. పాఠశాలల్లో విద్యార్థి ప్రగతి తెలుసుకోవడానికి, మౌలిక సదుపాయాల అభివృద్ధి, నాణ్యమైన విద్యను అందించడానికి, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు, విద్యార్థులకు మధ్య మంచి సంబంధాలు నెలకొల్పేందుకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఈ సమావేశాలను ఒక పండుగలా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్య నాణ్యత అనే విషయాలపై స్టార్‌ రేటింగ్స్‌ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పేరెంట్స్‌, టీచర్స్‌ సమావేశం నిర్వహించేందుకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేసింది. ఈ నిధులతో పాఠశాలల ప్రాంగణాల్లో అలంకరణ, టెంట్‌, మైక్‌ ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి బహుమతులను అందజేస్తారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో జరిగే సమావేశాలకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు మంజూరు చేసింది. కర్నూలు జిల్లాలో మొత్తం 1,457 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 2.90 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అలాగే ఈ పాఠశాలల్లో 7,947 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. పాఠశాలలకు ప్రభుత్వం రూ.47.45 లక్షల నిధులు మంజూరు చేసింది. ఈ నిధులకు అవసరమైతే.. దాతల నుంచి సమీకరించుకోవాలని విద్యాశాఖ అధికారులకు సూచనలు చేసింది.

సర్వం సిద్ధం

పేరెంట్స్‌, టీచర్స్‌ మీట్‌కు సర్వం సిద్ధం చేశాం. ఈ సమావేశాలను విజయవంతం చేసేందుకు కలెక్టర్‌ ఆధ్వర్యంలో అన్ని చర్యలు తీసుకున్నాం. పాఠశాలల ప్రధానోపాధ్యాయులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి. ఎంఈవోలు, ఉప విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారు. ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులకు, పూర్వ విద్యార్థులకు సమాచారం పంపించాం. పాఠశాల అభివృద్ధిలో వారి భాగస్వామ్యం కోసం సమాచారం చేరవేశాం.

- శ్యామ్యూల్‌ పాల్‌, డీఈవో

Updated Date - Dec 07 , 2024 | 12:10 AM