ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భ్రూణ హత్యలను నివారించాలి

ABN, Publish Date - Oct 30 , 2024 | 11:40 PM

లింగ వివక్షకు కారణమవుతున్న భ్రూణ హత్యల నివారణకు కృషిచేయాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. బుధవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ కేంద్రాలను ఉపేక్షించొద్దు

సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌

ఆదోని, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): లింగ వివక్షకు కారణమవుతున్న భ్రూణ హత్యల నివారణకు కృషిచేయాలని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌ ఆదేశించారు. బుధవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పీసీ పీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రుల ఆలోచనా విధానంలో మార్పులు తీసుకురావడం ద్వారానే భ్రూణ హత్యలను నివారించవచ్చన్నారు. ఈ మేరకు అవగాహన కలిగించాలని కోరారు. లింగ నిర్ధారణ చేసే స్కానింగ్‌ కేంద్రాలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని అత్రికమిస్తే ఔరూ.50వేలు జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడుతుందన్నారు. స్కానింగ్‌ కేంద్రాల అక్రమాలపై ఖచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.25వేల నుంచి రూ.లక్ష వరకు బహుమతి ఇస్తామన్నారు. ఆదోని డివిజన్‌ పరిధిలో 48 స్కానింగ్‌ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా ఐదు కేంద్రాలు అనుమతి కోసం దరఖాస్తు చేసుకోగా ఉన్నతాధికారులకు నివేదించినట్లు డిప్యూటీ డీఎంహెచ్‌వో తెలిపారు స్కానింగ్‌ కేంద్రాలను మూడు నెలలకోసారి తనిఖీచేయాలని, నిబంధనలను విరుద్ధంగా వ్యవహరిస్తే అనుమతి రద్దుచేయాలని అన్నారు. డిప్యూటీ డీఎంహెచ్‌వో సత్యవతి, జిల్లా నోడల్‌ అధికారి డా నాగప్రసాద్‌, చిన్నపిల్లల వైద్యులు పరిమళ, డెమో అధికారి శ్రీనివాసులు, డిప్యూటీ డెమె అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి, జిల్లా మానిటరింగ్‌ కన్సల్టెంట్‌ అధికారి సుమలత, డిప్యూటీ డీఈవో వెంకటరమణారెడ్డి, ఎంఈవోలు రాజేంద్ర శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 11:40 PM