ఉల్లి రైతుకు న్యాయం జరిగే దాకా పోరాటం
ABN, Publish Date - Oct 30 , 2024 | 11:32 PM
కర్నూలు మార్కెట్ యార్డులో పది రోజులుగా ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు న్యాయం చేయడం లేదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు.
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ
రోడ్డుపై బైఠాయించిన రైతులు
స్తంభించిన వాహనాల రాకపోకలు
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్ యార్డులో పది రోజులుగా ఉల్లి రైతులు ఇబ్బంది పడుతున్నా అధికారులు న్యాయం చేయడం లేదని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ అన్నారు. బుధవారం రైతు సంఘం ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి నిరసన తెలియజేశారు. దీంతో బస్టాండు ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. నాలుగో పట్టణ పోలీసులు స్పందించి వాహనాలను వివిధ మార్గాల్లో రాకపోకలకు అనుమతించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ రైతుల సమస్యను పరిష్కరించమంటే.. తమ గొంతు నొక్కే ప్రయత్నం చేయడం దారుణమని ఆరోపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
Updated Date - Oct 30 , 2024 | 11:32 PM