ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

దాడి కేసులో ఐదేళ్ల జైలు శిక్ష

ABN, Publish Date - Mar 22 , 2024 | 12:32 AM

మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన దండు గోపాలకృష్ణకు ఆళ్లగడ్డ అసిస్టెంటు సెషన్స్‌ న్యాయాధికారి శైలజ ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.

రుద్రవరం, మార్చి 21: మండలంలోని శ్రీరంగాపురం గ్రామానికి చెందిన దండు గోపాలకృష్ణకు ఆళ్లగడ్డ అసిస్టెంటు సెషన్స్‌ న్యాయాధికారి శైలజ ఐదేళ్లు జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ గురువారం తీర్పునిచ్చినట్లు ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. 2017లో వర్షం కోసం గోపాలకృష్ణ కప్పలతో ఊరేగింపు నిర్వహిం చారు. ఆయన చందా అడగడంతో అదే గ్రామానికి చెందిన చిన్న వెంక టేశ్వర్లు రూ.50 ఇచ్చారు. మరోసారి అడగడంతో డబ్బులు లేవని చిన్నవెం కటేశ్వర్లు తమ్ముడు రమణ చెప్పారు. చందా అడిగితే ఇవ్వవా? అంటూ గోపాలకృష్ణ రమణపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. రమణ సోదరుడు చిన్న వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయడంతో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడికి ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా విఽధించినట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితుడిని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు తరలించినట్లు తెలిపారు.

Updated Date - Mar 22 , 2024 | 12:32 AM

Advertising
Advertising