ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ABN, Publish Date - Nov 10 , 2024 | 12:42 AM

ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు.

ఆటో డ్రైవర్లు, ప్రజలతో మాట్లాడుతున్న ఎస్పీ జి.బిందుమాధవ్‌

ట్రాఫిక్‌ అవేర్నెస్‌ కౌన్సెలింగ్‌ సెంటర్‌ ప్రారంభం

కర్నూలు క్రైం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలను పాటించాలని ఎస్పీ జి.బిందు మాధవ్‌ అన్నారు. శనివారం కొత్తపేట సమీపంలో ఆధునికీకరించిన ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో ట్రాఫిక్‌పై అవగాహన, కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కర్నూలులో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ప్రమాదాలను తగ్గించేందుకు, ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా సజావుగా సాగేందుకు ఆటోడ్రైవర్లు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆటోలను నిర్ణీత ప్రాంతాల్లో మాత్రమే పార్కింగ్‌ చేయాలన్నారు. మైనర్లు వాహనాలు నడపడం ద్వారా ప్రమాదాలు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. ప్రతి ఆటోకు పోలీసు గుర్తింపు సంఖ్య తప్పనిసరిగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలు, నేరాలను అరికట్టడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు జరిగినా డయల్‌ 112కు గానీ, డయల్‌ 100కు గానీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు ఎస్పీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీఎస్పీ జే బాబు ప్రసాద్‌, ట్రాఫిక్‌ సీఐ మన్సూరుద్దీన్‌, సీఐలు రామయ్య నాయుడు, నాగరాజారావు, మురళిధర్‌ రెడ్డి, మధుసూదన్‌ గౌడు, పవన్‌ కుమార్‌, ట్రాఫిక్‌ ఆర్‌ఎస్‌ఐ హుశేన్‌, ఆటో యూనియన్‌ సంఘాలు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2024 | 12:42 AM