ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.20 కోట్లు ఇస్తామని మోసం

ABN, Publish Date - Nov 14 , 2024 | 11:51 PM

సెంట్రల్‌ ఫండ్‌ నుంచి రూ.20 కోట్లు ఇస్తామని, అందుకు గాను జీఎస్‌టీ కింద రూ.15 లక్షలు చెల్లించాలని నమ్మించే ప్రయత్నం చేసిన ఓ ముఠాను టూ టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు.

అరెస్టు చూపిస్తున్న టూ టౌన్‌ సీఐ, ఎస్‌ఐలు

కర్నూలు క్రైం, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): సెంట్రల్‌ ఫండ్‌ నుంచి రూ.20 కోట్లు ఇస్తామని, అందుకు గాను జీఎస్‌టీ కింద రూ.15 లక్షలు చెల్లించాలని నమ్మించే ప్రయత్నం చేసిన ఓ ముఠాను టూ టౌన్‌ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు హరీష్‌, భానుప్రతాప్‌, ప్రతాపరెడ్డి, శ్రీధర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. సీఐ నాగరాజా రావు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి జిల్లా సిద్దవరం గ్రామానికి చెందిన సోమశేఖర్‌కు బెంగళూరుకు చెందిన హరీష్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తనకు విప్రో, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌ లాంటి పెద్ద కంపెనీలతో పరిచయాలు ఉన్నాయని నమ్మించాడు. ఏదైనా ఫ్యాక్టరీ, ట్రస్టు లాంటివి ఉంటే ఈ కంపెనీల నుంచి రూ.20 కోట్లు అప్పుగా ఇప్పిస్తానని, అందుకు గాను రూ.15 లక్షలు జీఎస్‌టీ కింద చెల్లించాల్సి ఉంటుందని నమ్మించాడు. ఇది నిజమని నమ్మిన సోమశేఖర్‌ తన మిత్రుడు బసవరాజుతో కలిసి హరీష్‌ డీల్‌కు సరేనన్నాడు. బుధవారం హర్ష అనే వ్యక్తి వీరికి ఫోన్‌ చేసి కర్నూలు రాజ్‌ విహార్‌ లాడ్జికి రావాలని, అక్కడ రూ.15 లక్షలు ఇస్తే వెంటనే రూ.20 కోట్లు మీ ఖాతాలో జమ చేస్తానని చెప్పాడు. సోమశేఖర్‌, బసవరాజు ఇద్దరూ కలిసి బుధవారం రాత్రి కర్నూలు రాజ్‌విహార్‌ లాడ్జికి వచ్చారు. అప్పటికే లాడ్జి గదిలో నిందితులు నలుగురు ఉన్నారు. వారి మాటలను బట్టి తమను మోసగిస్తున్నారని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు లాడ్జికి వచ్చేసరికి అప్పటికే ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. పోలీసులు అప్రమత్తమై పారిపోయిన ఇద్దరితోపాటు లాడ్జిలోని ఇద్దరిని పట్టుకొని వారి వద్ద నుంచి మహీంద్రా కారు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు.

Updated Date - Nov 14 , 2024 | 11:51 PM