గంగమ్మ ఒడికి..
ABN, Publish Date - Sep 16 , 2024 | 12:48 AM
నగరంలో గణేశ నిమజ్జనోత్సవాలు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు కమనీయంగా సాగాయి
కర్నూలు(కల్చరల్, న్యూసిటీ) సెప్టెంబరు 15: నగరంలో గణేశ నిమజ్జనోత్సవాలు ఆదివారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంతవరకు కమనీయంగా సాగాయి. చిన్నా పెద్ద విగ్రహాలు కలిపి సుమారు రెండు వేల విగ్రహాలను ప్రతిష్టించగా, నగరంలో వినాయక ఘాట్‌తో పాటు సుంకేసుల రోడ్డులోని స్టాంటనపురం కేసీ కెనాల్, సంకల్‌బాగ్ తుంగభద్ర నదిలో విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరపాలక సంస్థ అధికారులు మొత్తం ఎనిమిది భారీ క్రేనలను ఏర్పాటు చేశారు. నగరంలో ప్రధాన మార్గాలు తప్పిం చి, ఎనఆర్ పేట, ప్రకాశనగర్, రోజావీధి, ఎస్‌బీఐ ఆఫీసర్స్ కాలనీ, అశోక్‌నగర్, వెంకటరమణ కాలనీ, బాలాజీ నగర్, రామలింగేశ్వరనగర్ తదితర ప్రాంతాలకు చెందిన ఉత్సవ మూర్తులను స్టాంటనపురం వద్దగల కేసీ కెనాల్‌లో నిమజ్జనం చేశారు. గాంధీటవర్స్ అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం కేంద్రంలో టీడీపీ నంద్యాల జిల్లా అద్యక్షుడు మల్లెల రాజశేఖర్ పూజలు నిర్వహించారు.
ఫ నిమజ్జన కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటలకు మొదలుపెట్టాల్సి ఉండగా అతిథుల రాక ఆలస్యం కావడంతో మధ్యాహ్నం మూ డు గంటలకు ప్రారంభించారు.
ఫ మధ్యాహ్నం నుంచే వివిధ ప్రాంతాల్లోని విగ్రహాలు ప్రధాన రోడ్లపైకి చేరుకున్నాయి. నగరంలో నాలుగు ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను కేసీ కెనాల్ వద్ద గల వినాయక ఘాట్‌కు తరలించారు.
ఫ పాతనగరం నుంచి తొలి ఊరేగింపు ఉదయం 10 గంటలకు ప్రారం భం కాగా, రెండో ఊరేగింపు మధ్నా హ్నం 4 గంటలకు బళ్లారి చౌరస్తా నుంచి, అదే సమయానికి మూడో ఊరేగింపు కల్లూరు చెన్నమ్మ సర్కిల్ నుంచి, నాలుగో ఊరేగిపు నంద్యాల చెక్‌పోస్టు నుంచి మొదలైంది.
ఫ ఈ ప్రధాన రహదారుల్లో ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ వాహనాలు మినహా ఇతర వాహనాలను పోలీసులు అనుమతించలేదు. దీంతో రోడ్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
ఫ సాయంత్రం రాజ్‌విహార్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు దారికి ఇరువైపుల భక్తులు ఫ్లాట్‌ఫారాలు, డివైడర్లపై కూర్చొని వినాయక విగ్రహాలను తిలకిస్తూ పరవశించారు.
ఫ వినాయక ఘాట్ వద్ద రోడ్డుకు అటూ, ఇటూ తిరునాళ్లను తలపించేలా పిల్లలను ఆకర్షించే విభిన్న రకాల బొమ్మలతో వ్యాపారులు స్టాళ్లు ఏర్పా టు చేసుకున్నారు. గణేశ ఉత్సవాల్లో పిల్లలు ముఖాలకు పెట్టుకునే మాస్కులు, టోపీలు, బెలూన్లు వంటి వాటిని ఆకర్షణీయంగా కనిపించాయి.
ఫ నిమజ్జనాన్ని తిలకించేందుకు కొందరు నగరవాసులు ద్విచక్ర వాహనాలపై తమ పిల్లలను కూర్చొబెట్టుకొని ప్రధాన రహదారుల్లో తిరిగారు.
ఫ కలెక్టరేట్‌లోని పరిపాలన గణపతి ఉత్సవ మూర్తికి ఇనచార్జి ఆర్‌డీవో చిరంజీవి పూజలు చేసి నిమజ్జన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఫ నగర పాలక సంస్థ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రతిష్టించిన ఎనిమిది అడుగుల మట్టి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నిమజ్జనోత్సవంలో భాగంగా కమిషనర్ పీవీ రామలింగేశ్వర్ నృత్యాలు చేసి అందరిని ఉత్సాహపరిచారు. వీరితో పాటు అధికారులు, యువత డాన్స వేస్తూ ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, ఏఈలు దినేష్, జనార్దన, సీనియర్ అసిస్టెంట్ రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.
వినాయక ఘాట్ వద్ద గణనాథుల నిమజ్జనం
నగర నడిబొడ్డునగల కేసీ కెనాల్ ఒడ్డున ఉన్న వినాయక ఘాట్‌లో ఊరేగింపుగా తీసుకువచ్చిన గణేశ విగ్రహ మూర్తులను నిమజ్జనం చేశారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో పాటు ఆర్డీవో శేషిరెడ్డి, విశ్రాంత కలెక్టర్ రాంశంకర్ నాయక్, వీహెచపీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన, ఎస్వీ మోహనరెడ్డి, గణేశ మహోత్సవ కేంద్ర సమితి ఉమ్మడి జిల్లా కార్యదర్శి డాక్టర్ ఎం.నాగఫణిశాసి్త్ర, జిల్లా, నగర అధ్యక్షుడు వేణుగోపాల్, డాక్టర్ మోక్షేశ్వరుడు, 41వ వార్డు కార్పొరేటర్ శ్వేతారెడ్డి, ఉత్సవ కమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. జేసీ డాక్టర్ బి. నవ్య జ్యోతి ప్రజ్వలన చేయగా, ఉత్సవాల ధ్వజారోహణ నందిరెడ్డి సాయిరెడ్డి చేపట్టారు. నిమజ్జన కార్యక్రమాన్ని ఎస్పీ, నగర మేయర్ ప్రారంభించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన పరిపాలన గణపతికి వారు పూజలు చేసి నిమజ్జనోత్సవానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నగరపాలక సంస్థలో ఏర్పాటు చేసిన గణపతి మూర్తిని నిమజ్జనం చేశారు. రాంభొట్ల దేవాలయం నుంచి వచ్చిన వివేకానంద యూత వారి విగ్రహాన్ని నిమజ్జనం చేయడంతో వరుసగా విగ్రహాలను తరలించే ఏర్పాట్లు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
విద్యుద్దీపాలతో శోభాయమానంగా వినాయక ఘాట్
వినాయక ఘాట్‌ను విద్యుద్దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. కెనాల్‌కు రెండు వైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. భక్తులు నీళ్లలోకి దిగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. కేసీ కెనాల్ వద్ద జరిగిన నిమజ్జన వేడుకల్లో విశ్రాంత ఆచార్యులు డాక్టర్ కొట్టే చెన్నయ్య, పరశురాముని రామకృష్ణ వ్యాఖ్యానం చేశారు. ఉత్సవ సమితి నాయకులు రంగస్వామి, గూడా సుబ్రహ్మణ్యం, సందడి మహేష్, సందడి సుధాకర్, అక్కెం విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో రాంబొట్ల దేవాలయం నుంచి వినాయక ఘాట్ వరకు ఎనిమిది తాగునీటి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎనిమిది కూడళ్లలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. పాతనగరం నుంచి వినాయక ఘాట్ వరకు వివిధ ప్రాంతాల్లో పలు స్వచ్ఛంద సేవా సంస్థలు అన్నదానం, అల్పాహారం పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేశాయి. అలాగే మంచినీళ్ల ప్యాకెట్లను భక్తులకు ఉచితంగా పంపిణీ చేశారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
గణేశ నిమజ్జనోత్సవంలో భాగంగా కేసీ కెనాల్ ఘాట్ వద్ద సంస్కార భారతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రభుత్వ శారద సంగీత, నృత్య కళాశాల విద్యార్థుల నృత్యా లు, సూర్యకళా అకాడమీ, పవన స్టార్ మ్యూజిక్, అన్నమాచార్య సేవా ట్రస్టుచే గణపతి నృత్యాలు, లలితా పీఠం వారి కోలాట నృత్యాలు, విజ్ఞాన పీఠం పాఠశాల విద్యార్థుల చెక్కభజన, నాట్యవేద కళానిలయం, శ్రీరామకృష్ణ పాఠశాల విద్యార్థుల బృంద నృత్యం ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు అతిథులు జ్ఞాపికలు, ప్రశంసాపాత్రాలు అందజేశారు.
నిమజ్జనోత్సవంలో పలుచోట్ల అన్నదానాలు
గణేశ నిమజ్జనోత్సవం సందర్భంగా నగరంలో వివిధ ప్రాంతాల్లో అన్నదాన కేంద్రాలు ఏర్పాటు చేసి భక్తులకు పంపిణీ చేశారు. నగరంలో జడ్పీ కార్యాలయ సమీపంలోని కేఈ ప్లాజాలో మాజీ మంత్రి, సీనియర్ టీడీపీ నేత కేఈ ప్రభాకర్ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమానికి స్పందన లభించింది. నగరం లోని వీకర్ సెక్షన కాలనీలోగల విగ్రహం వద్ద సీనియర్ రంగస్థల నటుడు గాండ్ల లక్ష్మన్న ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. బుధవారపేటలోని శ్రీలక్ష్మీ గణేశ నగర భక్తబృందం సుశీల నేత్రాల యంలో ఏర్పాటు చేసిన విగ్రహం నిమజ్జనంలో మహిళా భక్తులు ఏకరూప దుస్తులతో ఆకట్టుకున్నారు. ఎర్రబురుజు వినాయకుడి విగ్రహం తరలింపులో మహిళ ట్రాక్టర్ నడుపుతూ భక్తులకు ఆకట్టుకున్నారు.
కల్లూరు: గణనాథుడికి జేజేలంటూ డప్పు వాయిద్యాల నడుమ వినాయ కుడి విగ్రహాలను ఆదివారం నిమజ్జనానికి తరలించారు. కల్లూరు అర్బన పట్ట ణంలో ఆయా వార్డుల్లో మండపాల కమిటీ సభ్యులు, భక్తబృందాల ఆధ్వర్యంలో యువకులు, మహిళలు నృత్యాలు చేస్తూ విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు.
వినాయక మండపాల్లో గౌరు చరిత పూజలు: పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ఆదివారం 19, 20 వార్డుల్లో వినాయక విగ్రహాలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, మహిళలు గౌరు చరితను సన్మానించారు. కార్యక్రమంలో పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌యాదవ్, బ్రాహ్మణపల్లె నాగి రెడ్డి పాల్గొన్నారు. అలాగే నగరంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు అదివారం ప్రత్యేక పూజలు, లడ్డూ వేలం, ఉట్టికొట్టే ఆట, డీజేలతో యువత నృత్యం చేస్తూ కేరింతలు కొట్టారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత తీగలు కిందకు ఉండటంతో వినాయక శోభాయాత్ర సమయంలో కరెంట్ తీసి ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఓర్వకల్లు: మండలంలోని సోమయాజులపల్లె గ్రామంలో వినాయక నిమజ్జనం ఘనంగా నిర్వహించారు. 9 రోజులుగా గణేష్ మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు చేశారు. వినాయుకుని లడ్డూను వేలం పాట ద్వారా దక్కించుకున్నారు. వినాయకున్ని ట్రాక్టర్‌పై నిమజ్జనానికి తరలించారు. అనంతరం కాల్వబుగ్గలో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Updated Date - Sep 16 , 2024 | 12:48 AM