ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా బాలల దినోత్సవం

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:51 AM

కోల్స్‌ ఉన్నత పాఠశాల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

కాంగ్రెస్‌ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న నాయకులు

కర్నూలు కల్చరల్‌, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): కోల్స్‌ ఉన్నత పాఠశాల్లో గురువారం బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం హెచఎం ఆర్‌పీ రాజా రావు అధ్యక్షతన జరిగింది. తొలుత నెహ్రూ చిత్రపటానికి పూలమా లలు వేసి నివాళి అర్పించారు. పూర్వ విద్యార్థులు కోల్స్‌ ఫౌం డేషన అధ్యక్షుడు, విశ్రాంత ఉపాధ్యాయుడు పి.విజయకుమార్‌, ఎస్‌సీఐ మేనేజర్‌ పి.సంపతకుమార్‌, ఎస్‌బీఐ అసిస్టెం ట్‌ మేనేజర్‌ డేవిడ్‌, పాస్టర్‌ ఎస్‌జే సజీవరావు, కోల్స్‌ కళాశాల ఫిజికల్‌ డైరెక్టర్‌ జయకుమార్‌, అల్‌బర్ట్‌, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ ఇందిరాశాంతి, పూర్వ విద్యార్థులు, పాల్గొన్నారు.

కర్నూలు అర్బన: దేశ ప్రజాస్వామ్య సౌధానికి నిర్మాత పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ అని జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పి.మురళీకృష్ణ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కార్యక్ర మంలో మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర్‌బాబు, పార్లమెంట్‌ ఇనచార్జి పీజీ రాంపుల్లయ్య, నగర అధ్య క్షుడు షేక్‌ జిలానీ, షేక్‌ ఖాజా హుస్సేన, అనంతరత్నం మాదిగ, వెంకట సుజాత, బజారన్న, ప్రమీల పాల్గొన్నారు.

కర్నూలు ఎడ్యుకేషన: నగర శివారులోని పంచలింగాల మాంటిస్సోరి ఒలంపస్‌ పాఠశాలలో బాలల దినోత్సవం గురువా రం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏకపాత్రా భినయం, స్కిట్‌లు, పాటలు, నెహ్రూ జీవిత చరిత్ర లోని కొన్ని ఘట్టాలను విద్యార్థులు ప్రదర్శించారు. మాంటిస్సోరి విద్యా సంస్థల వ్యవస్థాపకురాలు కళ్యాణమ్మ నాటిక ద్వారా జీవిత చరిత్రను వివరించారు. కార్యక్రమంలో వెల్కమ్‌, కొరియన, ఫిరమిడ్‌, యోగా డ్యాన్సలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్ర మంలో పాఠశాల డైరెక్టర్‌ కేఎనవీ రవిప్రకాష్‌, ప్రిన్సిపాల్‌ నాగ లక్ష్మీ, సిధ్ధార్థ్‌, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:51 AM