ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హద్దులు దాటి ఆదాయం

ABN, Publish Date - Dec 07 , 2024 | 12:14 AM

కర్నూలు జిల్లాలో రేషన్‌ బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది. కూట మి ప్రభుత్వం వచ్చాక రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కళ్లెం పడుతుందని ఆశిస్తే అదేం జరగ లేదు.

నవంబరు 15 న రేషన్‌ బియ్యం లారీని మంత్రాలయం మండలం మాధవరం చెక్‌ పోస్టు వద్ద అధికారులు సీజ్‌ చేశారు. ఆదోని నుంచి రాయచూరుకు బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు

కూటమి ప్రభుత్వంలోనూ ఆగని దందా

అక్రమంగా కర్ణాటకకు రవాణా

ఆదోనిలో బీజేపీ యువ నేతకనుసన్నలో వ్యాపారం

కర్నూలులో ఇద్దరు బియ్యం డాన్‌ల ఇష్టారాజ్యం

ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరులోనూ ఆగని వైనం

రూ.కోట్లలో రేషన్‌ బియ్యం కుంభకోణం

కర్నూలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలో రేషన్‌ బియ్యం మాఫియా పెట్రేగిపోతోంది. కూట మి ప్రభుత్వం వచ్చాక రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు కళ్లెం పడుతుందని ఆశిస్తే అదేం జరగ లేదు. పార్టీ రంగులు మార్చి కూటమి నాయకుల ఆశీస్సులతో కొందరు గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటిస్తున్నారు. దీని వెనుక పెద్ద మాఫియా ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు నగరంలో ఇద్దరు బియ్యం డాన్‌లు, ఆదోనిలో బీజేపీ మాస్క్‌ వేసుకున్న మాజీ వైసీపీ యువ నేత కనుసన్నల్లో రేషన్‌ బియ్యం సరిహద్దులు దాటుతున్నట్టు తెలుస్తోంది. వీరికితోడు ఎమ్మిగనూరు, పత్తికొండ, కోడుమూరు ప్రాంతాల్లోనూ మాఫియా చెలరేగిపోతోంది. పలు ప్రాంతాల్లో ఎండీయూ వాహనాల అడ్డాగా ఈ భాగోతం సాగుతున్నట్టు సమాచారం. అధికారం ముసుగులో నెలనెలా సాగిస్తున్న రూ.కోట్ల రేషన్‌ బియ్యం కుంభకోణంపై ఆంధ్రజ్యోతి కథనం.

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఏపీ ప్రభుత్వ పౌర సరఫరాల (సివిల్‌ సప్లయ్‌) శాఖ పర్యవేక్షణలో 2,437 నిత్యావసర సరుకుల పంపిణీ దుకాణాలు ఉన్నాయి. 12.18 లక్షల రేషన్‌ కార్డు కలిగిన లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత బియ్యం, రూపాయికి కిలో బియ్యం పథకాల ద్వారా నెలకు 20 వేల మెట్రిక్‌ టన్నులు పేదలకు సరఫరా చేస్తున్నాయి. ప్రతి వ్యక్తికి ఐదు కిలోల చొప్పున కుటుంబంలో ఎంత మంది ఉంటే అందరికి లెక్కకట్టి రాయితీ బియ్యం ఇస్తున్నారు. ఈ లెక్కన రేషన్‌ బియ్యం రూపంలో ప్రభుత్వ ఖజానాపై నెలకు రూ.83 కోట్లకు పైగా భారం పడుతోంది. భారమైనా సరే సామాన్యులకు ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ బియ్యం అక్రమార్కులకు ఆదాయ వనరుగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో బియ్యం మాఫియా పెట్రేగిపోతే.. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా బియ్యం దందా ఆగడం లేదు. మాఫియాకు నాయకత్వం వహించే డాన్‌లు మారారు. గత వైసీపీ హయాంలో రేషన్‌ బియ్యం మాఫియా రూ.కోట్లకు పడగలెత్తారు అంటే ఏ స్థాయిలో అక్రమ రవాణా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తామేం తక్కువా అంటూ కూటమి ప్రభుత్వంలోనూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిస్తున్నారు. అధికార కూటమి నాయకుల అండదండలు ఉండడంతో నిఘా అధికారులు కళ్లకు గంతలు కట్టుకున్నారనే ఆరోపణలు లేకపోలేదు.

కిలోకు రూ.46 ఖర్చు:

వరి ధాన్యం పండించే రైతులకు భరోసా.. పేదలకు ఆకలి తీర్చి ఆహార భద్రత కల్పించాలనే లక్ష్యంగా ధాన్యం కొనుగోలు, మిల్లు ఆడించడం, రవాణా, గోదాముల బాడుగ.. ఇలా వివిధ రూపాల్లో కార్డుదారుడికి అందించేసరికి కిలోకు రూ.46 ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాలో 20,501 మెట్రిక్‌ టన్నులు కోటా ఉంటే 90 శాతం 18 వేల టన్నులు పేదలకు ఇస్తున్నట్లు పౌర సరఫరా అధికారులు తెలిపారు. నెలకు రూ.83-85 కోట్లు చొప్పున ఏడాదికి రూ.వెయ్యి కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతోంది. ఐదుగురు సభ్యుల కుటుంబానికి 25 కిలోలకు రూ.1,150 బియ్యం రాయితీ ఇస్తున్నారు. కార్డుదారుడి నుంచి మధ్య దళారులు కిలో రూ.10-12లకు సేకరిస్తే వారి నుంచి మాఫియా కిలో రూ.16-18లకు సేకరించి సరిహద్దులు దాటించి కర్ణాటకలో కిలో రూ.25-28కు విక్రయిస్తున్నారు.

కనిపించని కుంభకోణం ఇది!

జిల్లాలో కర్నూలు సోనా, నంద్యాల సోనా బియ్యం సాగుకు ప్రసిద్ధి. సామాన్యులు సైతం సన్నరకం సోనా బియ్యానికి అలవాటు పడ్డారు. రేషన్‌ బియ్యానికి దోసెలకు మాత్రమే వాడుతున్నారు. మిగిలిన 35 శాతానికి పైగా మాఫియా పంపించే దళారులకు అమ్మేస్తున్నారు. నెలనెలా దాదాపుగా రూ.20-25 కోట్లకు పైగా విలువైన రేషన్‌ బియ్యం కర్ణాటకకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. చాప కింద నీరులా విస్తరిస్తున్న కనిపించని కుంభకోణం ఇది. కర్ణాటక నుంచి మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోని మద్యం తయారీ పరిశ్రమలకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం.

ఎండీయూ వాహనాల్లో కొనుగోలు

జిల్లా కేంద్రం కర్నూలు, ఆదోని సహా వివిధ ప్రాంతాల్లో పలువురు ఎండీయూ వాహన ఆపరేటర్లే బియ్యం బదులు కిలోకు రూ.10 లెక్కకట్టి ఇస్తున్నారు. కొందరు మహిళలు ఇంటింటికి వెళ్లి సేకరిస్తున్నారు. అలా సేకరించే బియ్యాన్ని అర్ధరాత్రి మాఫియా పంపించే ఆటోలలో చెప్పిన ప్రదేశానికి చేరవేస్తారు. ఆటోల్లో తీసుకొ చ్చిన బియ్యాన్ని ఓ లారీలో లోడ్‌ చేసి.. ఇద్దరు మోటార్‌బైక్‌లపై పైలెట్‌గా వెళితే వారి కనుసన్నల్లో బియ్యం లారీలు సరిహద్దులు దాటుతన్నాయి.లారీకి రూ.లక్ష వరకు లాభం ఉంటుందని సమాచారం.

అంతటా రేషన్‌ బియ్యం మాఫియా

కర్నూలు నగరంలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాలో బుధవారపేట, ఓల్డ్‌ టౌన్‌లో ఉంటున్న ఇద్దరు బియ్యం డాన్‌లదే రాజ్యమని తెలుస్తోంది. కొందరు రేషన్‌ డీలర్లు, ఎండీయూ వాహన ఆపరేటర్లు మిగిల్చిన బియ్యం, దళారులు ఇంటింటికి వెళ్లి సేకరించిన రేషన్‌ బియ్యాన్ని రహస్య గోదాములకు తరలిస్తారు. అక్కడి నుంచి రాత్రివేళ్లలో తుంగభద్ర నది దాటించి కర్ణాటకకు చేరుస్తున్నారు. వైసీపీ హయాంలోనూ.. టీడీపీ కూటమి ప్రభుత్వ హయాంలోనూ వారే హవా కొనసాగిస్తున్నారు.

ఆదోనిలో వైసీపీ హయాంలో చిన్న బాస్‌ కనుసన్నల్లో రేషన్‌ అక్రమ రవాణా సాగిస్తే.. తాజాగా బీజేపీ మాస్క్‌ వేసుకున్న మాజీ వైసీపీ యువ నాయకుడు రేషన్‌ బియ్యం డాన్‌ అవతారమెత్తాడు. ఊరూ వాడా తనదే అంటూ దళారులను పెట్టి సేకరించిన రేషన్‌ బియ్యంను అర్ధరాత్రి ఆటోల్లో ఆస్పరి రహదారిలోని రహస్య గోడౌన్‌కు చేర్చుతున్నాడు. అక్కడ లారీల్లో లోడ్‌ చేసి సరిహద్దులు దాటిస్తున్నాడు. ఈ బియ్యాన్ని కర్ణాటకలోని సిరిగుప్ప, రాయచూరు పట్టణాలకు చేరుస్తున్నారని సమాచారం. కొంత బియ్యం రైస్‌ మిల్లర్ల నుంచి నకిలీ వేబిల్లులు తీసుకొని నేరుగా కాకినాడ పోర్టుకు రవాణా చేస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పత్తికొండ, డోన్‌కు చెందిన బియ్యం డాన్‌లుగా అవతారమెత్తిన అక్రమార్కులు ఇంటింటా బియ్యం సేకరణ, డీలర్లు వద్ద మిగలిన బియ్యం సేకరించి ఆదోని, డోన్‌ పట్టణాలకు చేరుస్తున్నట్లు తెలుస్తోంది. డోన్‌ నుంచి నంద్యాలకు చేర్చి అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు చేరవేస్తున్నారనే సమాచారం. కోడుమూరులో సైతం బియ్యం మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన మాఫియానే కూటమి ప్రభుత్వంలోనూ రేషన్‌ బియ్యం అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఆలూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో కర్ణాటక సరిహద్దుల్లో ఉండడంతో నిఘా కళ్లకు చిక్కకుండా సరిహద్దులు దాటిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో రేషన్‌ కార్డులు, బియ్యం కోటా వివరాలు

వివరాలు కర్నూలు నంద్యాల మొత్తం

రేషన్‌ షాపులు 1,233 1,204 2,4347

ఎండీయూ

వాహనాలు 409 352 761

రేషన్‌

కార్డుదారులు 6,76,206 5,41,804 12,18,010

బియ్యం 20,500

కోటా నెలకు 11,845 8,655 (టన్నులు)

రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై నిఘా పెట్టాం

పేదలకు ఇచ్చే రేషన్‌ బియ్యం అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా ఉంచాం. పలు ప్రాంతాల్లో ఎండీయూ వాహన ఆపరేటర్లే బియ్యానికి బదులుగా నగదు ఇస్తున్నారనే వస్తున్నాయి. వారిపై కూడా నిఘా పెట్టాం. ఏ గ్రామంలోనైనా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా చేస్తున్నా అక్రమంగా నిల్వ చేసినా జిల్లా పౌర సరఫరాల అధికారులకు సమాచారం ఇస్తే తక్షణమే స్పందించి దాడులు చేస్తాం. సమాచారం ఇచ్చిన వారిపేర్లు గోప్యంగా ఉంచుతాం.

- రఘువీర్‌, కర్నూలు జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి

Updated Date - Dec 07 , 2024 | 12:14 AM