దివ్యాంగుల బాలల వసతి గృహం తనిఖీ
ABN, Publish Date - Nov 20 , 2024 | 12:32 AM
సి.క్యాంపులోని దివ్యాంగుల బాలల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మంగళవారం తనిఖీ చేశారు.
కర్నూలు లీగల్, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): సి.క్యాంపులోని దివ్యాంగుల బాలల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి మంగళవారం తనిఖీ చేశారు. గత వారంలో ఇద్దరు బాలలు కూరలో గుర్తు తెలియని మాత్రలు కలపడంతో కొంతమంది బాలలు అస్వస్థతకు గురైన విషయం విధితమే. ఈ సంఘ టనపై విచారించేందుకు ఆయన వసతి గృహాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన వసతి గృహంలోని వంట శాలను, భోజన వసతుల గురించి బాల లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో త్రీటౌన ఎస్ఐ జే.మన్మధ విజయ్, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఉద్యోగి నాగరాజు పాల్గొన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 12:33 AM