ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహానందిలో తొలిసారి జలహారతి

ABN, Publish Date - Nov 12 , 2024 | 12:45 AM

మహానంది క్షేత్రంలో కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకొని రాత్రి ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరు వద్ద వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించారు.

మహానందిలోని రుద్రగుండం కోనేరు ముందు గంగాదేవికి జలహారతి ఇస్తున్న అర్చకులు

మహానంది, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి):మహానంది క్షేత్రంలో కార్తీక రెండో సోమవారాన్ని పురస్కరించుకొని రాత్రి ఆలయం ప్రాంగణంలోని రుద్రగుండం కోనేరు వద్ద వేదమంత్రాలతో వేదపండితులు, అర్చకులు భక్తి శ్రద్ధలతో ప్రధాన ఆలయాల్లో పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల తో హారతులను కోనేరు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం గంగాదేవికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మొదటి సారిగా కార్తీక మాసంలో గంగాదేవికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం సారె సమర్పించారు. వేదమంత్రాలతో వైభవంగా జలహారతి నిర్వహించారు. ఇందులో భాగంగా అర్చకులు రాజరత్తయ్యబాబు, రాజమాణిక్యశర్మ, కొమ్మద్ది శంకరయ్యశర్మ భక్తిశ్రద్ధలతో జలహారతులు ఇచ్చారు. ఇక నుంచి ప్రతి కార్తీక సోమవారం క్షేత్రంలోని రుద్రగుండం కోనేరు వద్ద గంగాదేవికి జల హారతులు ఇస్తామని ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ ఎర్రమల్ల మధు, పర్యవేక్షకులు శశిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2024 | 12:45 AM